Janasena: కూటమిలో విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయా? ఎవరికి వారే పైచేయి సాధించాలని కొందరు నేతలు తహతహలాడుతున్నారా? పార్టీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు నేతల డిమాండ్ వెనుక ఏం జరిగింది? జనసేన ఎలా రియాక్ట్ వెనుక ఆలోచనేంటి? కాసింత డీటేల్స్‌లోకి..
ఏపీలో ఆరునెలల కిందట కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీల ముఖ్యనేతలు పర్యటనకు వెళ్లినప్పుడు పవన్ కల్యాణ్‌ను సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు హార్డ్ కోర్ అభిమానులు. లోకేష్‌కూ అదే సమస్య. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఈ మధ్య రీసౌండ్ మరింత ఎక్కువైంది.
జరుగుతున్న పరిణామాలను అధినేతలిద్దరు సైలెంట్‌గా గమనిస్తున్నారే తప్పా నోరు మెదపలేదు. కాకపోతే కొద్దిమంది నేతలు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ రెండు పార్టీల నేతల మధ్య వార్ మొదలైనట్టు కనిపిస్తోందన్నది ప్రత్యర్థుల మాట. ఈ వ్యవహారంపై తొలిసారి జనసేన నాయకుడు రాయల్ కిరణ్ రియాక్ట్ అయ్యారు.
నేతలకు, కార్యకర్తలకు ఆ తరహా కోరిక ఉండడం తప్పుకాదన్నారు రాయల్ కిరణ్. మా నాయకుడు పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలన్న కోరిక తమకు ఉంటుందన్నారు. కోట్లాది మంది ప్రజలు సైతం కోరుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని తాము ఓపెన్‌గా చెప్పలేకపోయామని, టీడీపీ నేతలు చెప్పారని మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: డిప్యూటీ సీఎం కాదు.. లోకేష్ సీఎం కావాలి – అగ్నికి ఆజ్యం పోసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి
కూటమిలో కలిసి ఉన్నప్పుడు నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న విషయం మరిచిపోకూడదన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడడం సరికాదన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినవాళ్లమి అవుతామన్నారు. అధినేతలిద్దరు మంచి రిలేషన్స్‌తో ముందుకు వెళ్తున్నారని, ఆ విధంగా ఉంటే మనకు మంచిదన్నారు.
ఇదే క్రమంలో మరో మాట చెప్పారు. మెగా బ్రదర్స్ ముగ్గురు కాదని, నలుగురన్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్, చంద్రబాబు అని వెల్లడించారు. తాము ఆ విధంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేతల మాటలను అడ్డుకుంటే వేయకుంటే రానురాను తీవ్రరూపం దాల్చే అవకాశముందన్నది తలపడిన రాజకీయ నేతల మాట.
గతంలో పవన్ కల్యాణ్ ఓ విషయాన్ని ఓపెన్‌గా చెప్పారు. ఇంకో పదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు కూడా. దీనిబట్టి చంద్రబాబు-పవన్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోందని గుర్తు చేస్తున్నారు.