Long Hair Tips| మీరు పొడవైన, ఒత్తైన జుట్టు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే, ప్రతి రోజు పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మీరు మెరుగైన ఫలితాలు పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన, మెరిసే జుట్టు కోసం రాత్రి సమయంలో పాటించే ఈ చిట్కాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని వారి అభిప్రాయం.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు లూజుగా వదలేసి పడుకోకూడదు..
జుట్టును రాత్రి పడుకునే ముందు వేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. దీనితో జుట్టు సురక్షితంగా ఉండి, చిక్కులు, పగుళ్లు రాకుండా ఉంటాయని వారు చెప్పారు. జుట్టును వదులుగా ఉంచి పడుకునే అవకాశం ఉంటే.. దిండుతో రాపిడి జరిగి జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కానీ జుట్టును మరీ బిగుతుగా కాకుండా, కాస్త వదులుగా వేసుకుని పడుకోవాలని వారు సూచిస్తున్నారు.
నూనె పెట్టుకుని పడుకోండి:
రాత్రంతా నూనె పెట్టుకుని పడుకోవడం వల్ల వెంట్రుకలు హైడ్రేట్ (Hydrate Your Hair) అవుతాయి. దెబ్బతిన్న వెంట్రుకలు రిపేర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్గాన్ నూనె, కొబ్బరి నూనె వంటి వాటిని ఉపయోగించడం వల్ల జుట్టుకు తేమను అందించడంతో పాటు, వాటికి బలం చేకూరుతుంది. జుట్టు మెరిసేలా చేయడంలో కూడా ఈ నూనెలు సహాయపడతాయని నిపుణలు తెలపారు. అయితే, కుదుళ్లపై నూనె పెట్టడం వల్ల జిడ్డుగా ఉండవచ్చు, అందువల్ల నూనెను సరిగా వెంట్రుకలకు మాత్రమే పెట్టాలని సూచిస్తున్నారు.
పడుకునే ముందు జుట్టును దువ్వుకోవాలి
నిద్రపోయే ముందు జుట్టును దువ్వుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చు. జుట్టు సహజంగా ఉత్పత్తి చేసే నూనెలు సమకూరి జుట్టు అంతటికీ చేరతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది వెంట్రుకలను బలంగా చేయడంతో పాటు, వాటిని రాలకుండా కాపాడుతుందని వారు పేర్కొన్నారు. అలాగే, జుట్టు చిక్కులు, పగుళ్లు రాకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. అయితే, దువ్వే సమయంలో సున్నితమైన దువ్వెనలతో తలపై ఒత్తిడి చేయకుండా దువ్వుకోవాలని సూచిస్తున్నారు.
హెయిర్ మాస్క్ వేసుకోండి:
పొడి, డ్యామేజ్ అయిన జుట్టు ఉన్నవారు, పడుకునే ముందు హెయిర్ మాస్క్ వేసుకోవాలని నిపుణులు సూచన. ఈ మాస్క్‌లను వాడడం వల్ల జుట్టుకు తేమ చేరి, దెబ్బతిన్న వెంట్రుకలు రిపేర్ అవుతాయని వారు చెప్పారు. మీరు ఎంచుకుంటున్న హెయిర్ మాస్క్ మీ జుట్టు స్వభావం, అవసరాలకు అనుగుణంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఉదయం ఈ హెయిర్ మాస్క్‌ని తప్పనిసరిగా తొలగించాలి.
Also Read: తల స్నానం చేసిన వెంటనే.. తడి జుట్టును దువ్వకూడదా? ఎందుకు?
తడి జుట్టుతో నిద్ర పోకండి:
చాలా మంది పడుకునే ముందు తల స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావిస్తారు. కానీ, తడి జుట్టుతో పడుకోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తడి జుట్టుతో పడుకుంటే, జుట్టు రాలిపోవడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే, దిండు కవర్లతో తడి జుట్టుకు రాపిడి జరిగి మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ మీరు తల స్నానం చేసుకుంటే, పడుకునే ముందు జుట్టును బాగా తుడుచుకొని ఆరిపోయాక నిద్రపోవాలి.
సిల్క్ లేదా ఫ్యాబ్రిక్ పిల్లో కవర్లు వాడండి:
మనం సాధారణంగా వాడే కుడుకువలు జుట్టుకు హానికరం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ కవర్లు జుట్టును దెబ్బతీయవచ్చు. అందుకే, సిల్క్ లేదా ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన పిల్లో కవర్లను వాడాలని వారు సూచిస్తున్నారు. ఈ రకమైన కవర్లు సున్నితమైన వస్త్రాలతో తయారు చేయబడినవని, కాబట్టి జుట్టుతో రాపిడి జరగదు అని వారు చెప్పారు. దీనితో జుట్టు తేమను కోల్పోవకుండా హైడ్రేట్‌గా, మెరిసిపోతుంది.
గమనిక: జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ టిప్స్ పాటించే ముందు వైద్య నిపుణులతో సంప్రదించాలి.