E-Paper
Advertisement

ఇండోనేషియా మోటార్ షోలో అదరగొట్టిన 5 కార్లు.. భారత్‌కు రాబోయేవి ఇవే!

ఇండోనేషియా మోటార్ షోలో అదరగొట్టిన 5 కార్లు.. భారత్‌కు రాబోయేవి ఇవే!
Advertisement

Indonesia Motor Show 2026: గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS) 2026 అట్టహాసంగా జరిగింది. ఈ ప్రదర్శనలో పలు కొత్త కార్లు, కాన్సెప్ట్ మోడళ్లు, ఆధునిక టెక్నాలజీతో సందడి చేశాయి. అయితే, భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఐదు కార్లు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వీటిలో కొన్ని త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండగా, మరికొన్ని భవిష్యత్తులో ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతి XL7, చైనా SUVలు ప్రత్యేక ఆకర్షణ

ఇండోనేషియా మోటార్ షోలో ప్రదర్శించిన మారుతి సుజుకి XL7 భారతీయులకు మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఇది మన దేశంలో విక్రయిస్తున్న XL6 ఫేస్‌ లిఫ్ట్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్తోంది. కొత్త డిజైన్, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరిన్ని ఫీచర్లతో ఈ మోడల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్, మెరుగైన సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా అందించే అవకాశం ఉందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

మరోవైపు చైనా కంపెనీలైన జెటూర్ T2 i-DM, iCAUR V23 SUVలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. సూపర్ డిజైన్, ప్రీమియం క్యాబిన్, ఆధునిక టెక్నాలజీ, ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ లతో ఈ వాహనాలు ప్రత్యేకంగా నిలిచాయి. జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ద్వారా ఈ బ్రాండ్లు భారత్‌ లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

BMW టెక్నాలజీ, టయోటా కొత్త ప్రయోగాలు

BMW కొత్త iX3 కూడా ఈ ఆటో షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీని డిజైన్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. లేటెస్ట్ డిజిటల్ ఫీచర్లు, నాణ్యమైన క్యాబిన్, మెరుగైన పనితీరు ఈ కారుకు ప్రత్యేకతగా నిలిచాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 800 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు భారత మార్కెట్లోకి వస్తే మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

టయోటా కూడా ఈ ప్రదర్శనలో బయోఫ్యూయల్‌తో నడిచే ఫార్చ్యూనర్ ప్రోటో టైప్‌ లను ప్రదర్శించింది. ఒక మోడల్ ఇథనాల్ తో, మరొకటి బయోడీజిల్‌ తో పని చేసేలా రూపొందించారు. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతుందనే సంకేతాలను టయోటా ఇచ్చింది.

హోండా ప్రిల్యూడ్ కూడా హైలైట్

హోండా కొత్త ప్రిల్యూడ్ స్పోర్ట్స్ కూపే కూడా అందరినీ ఆకట్టుకుంది. స్పోర్టీ డిజైన్, ఆధునిక స్టైలింగ్‌తో ఈ కారు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఎప్పటిలాగే నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన హోండా, ఈ మోడల్ ద్వారా మరోసారి తన ప్రత్యేకతను చూపించింది.

GIIAS 2026లో ప్రదర్శించిన ఈ ఐదు కార్లు భారత మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్ ప్రయోగాలు, లేటెస్ట్ కనెక్టెడ్ ఫీచర్లపై కంపెనీలు ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు ఈ ఆటో షో స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఈ మోడళ్లలో కొన్ని భారత రోడ్లపై కూడా కనిపించే అవకాశం ఉంది.

Read Also: ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Tags

Related News

తక్కువ ధరలో క్రేజీ ఏథర్ స్కూటర్.. లాంచ్ కు ముందే లుక్ రివీల్!

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

Big Stories

Advertisement
×