E-Paper
Advertisement

చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ‘చండీపూర’ వైరస్, ఇప్పటికే 25 మంది..

చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ‘చండీపూర’ వైరస్, ఇప్పటికే 25 మంది..
Advertisement

Chandipura Virus – CHPV: గుజరాత్‌ను వింత వైరస్ వణికిస్తోంది. చండిపూరగా పిలుస్తున్న ఈ వైరస్.. ఇప్పటికే 25 మంది చిన్నారులను బలిగొంది. ఇంకా 225 మంది చిన్నారులు ఈ వైరస్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో గుజరాత్ ప్రజలు.. తమ పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా భయాందోళనలకు గురవ్వుతున్నారు. అసలు ఏమిటీ చండిపూర వైరస్? పిల్లలనే ఎందుకు బలిగొంటోంది? వైద్యులు, అధికారులు.. ఈ వైరస్ వ్యాప్తిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?

చండీపూర వైరస్ అంటే?

చండీపుర వైరస్ (Chandipura Virus)ను మొదటిసారి 1965లో గుర్తించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఉన్న చండీపూర్ అనే గ్రామంలో ఈ వైరస్‌ను ముందుగా గుర్తించారు. అందుకే ఆ వైరస్‌.. ‘చండిపూర’ పేరుతో చెలామణి అవుతోంది. 1965లో పుణేలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (NIV) శాస్త్రవేత్తలు.. ఈ గ్రామంలో తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు రోగుల రక్త నమూనాలను పరిశీలించారు. ఇది ప్రమాదకరమైన సరికొత్త వైరస్‌గా గుర్తించి.. వైద్యాధికారులను అప్రమత్తం చేశారు.

ఈ వైరస్ ఎలా పుట్టింది?

Advertisement

ఇది రాబ్డోవిరిడే (Rhabdoviridae) కుటుంబానికి చెందిన ఒక RNA వైరస్. ఇసుక ఈగల (sandflies) ద్వారా ఈ వైరస్ మొదలైంది. ఇవి మనుషులను కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని రకాల దోమలు, నల్లులు.. బాధితుడి నుంచి ఇతరులకు ఈ వైరస్‌ను వ్యాప్తి చేయగలవు. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తీవ్రమైన జ్వరం, వాంతులు వస్తాయి. నాడీ వ్యవస్థపై వైరస్ దాడి చేసి మెదడువాపుకు దారితీస్తుంది. ఎక్కువగా ఈ వ్యాధి 15 ఏళ్ల లోపు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

వేగంగా విస్తరించే ప్రమాదకర వైరస్ ఇది

చండీపూర వైరస్ చాలా ప్రమాదకరమైనది, వేగవంతమైనది. లక్షణాలు కనిపించిన 24 నుంచి 48 గంటల్లోనే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉంది. దీన్ని త్వరగా గుర్తించినప్పుడే చికిత్స సాధ్యం అవుతుంది.

ఈ వైరస్ సోకినవారిలో కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే:

Advertisement

⦿ తీవ్రమైన జ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత.. హఠాత్తుగా పెరిగిపోతుంది.
⦿ వాంతులు, తలనొప్పి తీవ్రంగా ఉంటాయి. వాంతులు ఆగకుండా వస్తునే ఉంటాయి.
⦿ పిల్లలు చాలా నీరసించిపోతారు. అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోతారు.
⦿ ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి.. మూర్ఛ లేదా ఫిట్స్ వస్తాయి.
⦿ మెదడువాపు వల్ల నాడీ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. ఫలితంగా పక్షవాతం రావచ్చు. కొందరు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

పిల్లలను కాపాడుకోవాలంటే…

ఈ వైరస్‌కు ఇంకా నిర్దిష్టమైన టీకా (వ్యాక్సిన్) కనుగొనలేదు. వెంటనే నయం చేసే యంటీ వైరల్ మందులు కూడా లేవు. కాబట్టి.. ఇసుక ఈగలు కుట్టకుండా జాగ్రత్తపడటం మంచిది. ఇందుకు పిల్లల శరీరం పూర్తిగా కప్పిలా పొడవాటి చేతులు ఉండే దుస్తులు తొడగాలి. నిద్రించేప్పుడు దోమ తెరలు వాడాలి. కాళ్లు, చేతులకు ఒడోమస్ వంటి ఇన్సెక్ట్ రిపెల్లెంట్ క్రీములు రాయాలి.

ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి..

ఇసుక ఈగలు ఎక్కువగా మట్టి నివాసాల్లో ఉంటాయి. గోడల పగుళ్లలో నివసిస్తాయి. తేమ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి.. ఇంట్లో గోడలకు ఏమైన పగుళ్లు ఉంటే వెంటనే పూడ్చివేయాలి. ఇంటి పరిసరాల్లో మట్టి, చెత్తకప్పులు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా క్రిమీ సంహారక మందులు స్ప్రే చేయాలి. మీ పిల్లల్లో పైన చెప్పిన వ్యాధి లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. జ్వరమే కదా అని సొంత వైద్యాన్ని నమ్ముకోవద్దు.

ఈ ఈగలను ఎలా గుర్తించాలి?

ఇది సాధారణ ఈగల్లా ఉండవు. కాస్త దోమల తరహాలోనే ఉంటాయి. సైజులో దోమల కంటే చిన్నవి. సుమారు 2 నుంచి 3 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి. సాధారణ పరిమాణంలో నాలుగో వంతు ఉంటాయి. రెక్కల అమరిక V షేపులో ఉంటాయి. అయితే, వీటి రెక్కలు దోమలు, ఈగల తరహాలో సమతలంగా ఉండవు. రెక్కలు V ఆకారంలో పైకి నిలబడి ఉంటాయి. వీటి శరీరంపై ఈకలు ఎక్కువగా ఉంటాయి. కాస్త బొచ్చుతో ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇవి పసుపు, గోదుమ, గోదుమ రంగుల్లో ఉంటాయి. ఇది దోమల్లా ఎక్కువ దూరం ఎగరలేవు. చిన్న చిన్న అడుగులు వేస్తూ గెంతుతున్నట్లుగా కదులుతాయి. దోమల్లా శబ్దం చేయవు. కాబట్టి ఇవి కుడుతున్నప్పుడు గుర్తుపట్టడం కష్టం. చీకటి, తేమగా ఉండే ప్రదేశాలు, పశువుల పాకలు, చెత్త కుప్పలు, పాత చెట్ల తొర్రల్లో ఉంటాయి. రాత్రి వేళల్లో మాత్రమే ఇవి ఆహారం కోసం బయటకు వస్తాయి. మరింత మందిని అప్రమత్తం చేయడానికి ఈ ఆర్టికల్‌ను మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయండి.

Also Read: ముంబైలో వైరస్‌ల అటాక్.. కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఇదే!

Tags

Related News

విషపూరిత పూలతో పవర్‌ఫుల్ ఔషధాలు తయారీ.. మలేరియా, క్యాన్సర్‌కు చికిత్స

వానాకాలంలో పిల్లల లంచ్ బాక్స్‌కి బెస్ట్ ఫుడ్స్ ఇవే!

ఈ చిన్న లక్షణం కనిపిస్తే జాగ్రత్త.. 40 దాటాక మీ కళ్లు మీకు ఇస్తున్న వార్నింగ్ కావచ్చు!

చాణక్యనీతి.. అమ్మాయిలు ఈ 5 విషయాలు ఇతరులకు చెప్పకూడదు

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? దీనికి కారణాలు ఇవే

వర్షాకాలంలో పిల్లలకు చర్మ సమస్యలు.. చిన్నారుల స్కిన్‌కేర్‌ కోసం 8 జాగ్రత్తలు తప్పనిసరి

బోరింగ్ వ్యక్తిత్వం, పుస్తకాల పురుగు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు స్ఫెషల్

Big Stories

Advertisement
×