E-Paper
Advertisement

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Advertisement

H1N1 Virus Recovery| స్వైన్ ఫ్లూ అంటే H1N1 వైరస్ ఒక ఇన్‌ఫ్లుయెంజా వైరస్. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన నీరసం లాంటి సమస్యలు వస్తయి. సాధారణంగా రోగనిరోధక శక్తి బాగా ఉన్నవారికి వారం లేదా 15 రోజుల్లో లక్షణాలు తగ్గుతాయి. అయితే నోయిడాకు చెందిన శారదాకేర్-హెల్త్‌సిటీ, ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ చిరాగ్ టాండన్ ప్రకారం.. పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.

జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా దగ్గు, నీరసం కొంతకాలం కొనసాగవచ్చు. ఈ లక్షణాలు కొనసాగడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమైందని అర్థం కాదు. శరీరం పూర్తిగా కోలుకోవడానికి అదనపు సమయం అవసరం.

భారత్‌లో పెరుగుతున్న H1N1 కేసులు

Advertisement

భారత్‌లోని పలు ప్రాంతాల్లో H1N1 కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఇటీవలి వారాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టు 20 నాటికి ఢిల్లీలో 1,777 H1N1 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 27 నాటికి ఈ సంఖ్య 2,612కి చేరింది. కేవలం 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మొత్తం ఇన్‌ఫ్లుయెంజా – A కేసులు 3,300 దాటాయి. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.

H1N1 సాధారణంగా వారం రోజుల్లో తగ్గుతుంది

సాధారణ H1N1 ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ప్రధాన లక్షణాలు కొన్ని రోజుల్లో తగ్గడం ప్రారంభిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు సాధారణంగా వారం రోజుల్లో మెరుగుపడతాయి.
అయితే ప్రతి వ్యక్తిలో కోలుకునే సమయం ఒకేలా ఉండదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ఇన్ఫెక్షన్ తీవ్రత వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి.

H1N1 తర్వాత దగ్గు వారాల పాటు ఎందుకు ఉంటుంది?

Advertisement

ఫ్లూ సమయంలో శ్వాస వ్యవస్థలో వాపు, చికాకు ఏర్పడుతుంది. అందువల్ల జ్వరం తగ్గిన తర్వాత కూడా దగ్గు కొనసాగే అవకాశం ఉంది. కొంతమందిలో దగ్గు సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మరికొందరిలో అది కొన్ని వారాల పాటు కొనసాగవచ్చు. దగ్గు ఉండటం వల్ల వైరస్ ఇంకా చురుకుగా ఉందని తప్పనిసరిగా అర్థం కాదు. అయితే దగ్గు తగ్గకుండా మరింత తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి. దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి లేదా మళ్లీ జ్వరం వస్తే జాగ్రత్త అవసరం.

H1N1 తర్వాత నీరసం ఎందుకు కొనసాగుతుంది?

ఇన్ఫెక్షన్‌తో పోరాడే సమయంలో రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా శరీరం అలసటగా అనిపించవచ్చు. కొంతమందిలో నీరసం రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపించవచ్చు. అందుకే వెంటనే సాధారణ పనులకు తిరిగి వెళ్లడం కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది.

వాసన లేదా రుచి తగ్గితే ఏం చేయాలి?

వాసన లేదా రుచి తగ్గడం H1N1లో ప్రధాన లక్షణంగా పరిగణించరు. ముక్కు దిబ్బడ, వాపు కారణంగా కొంతకాలం ఈ ఇబ్బంది రావచ్చు. అయితే ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా వాసన లేదా రుచిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలి?

శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం కోలుకోవడంలో ముఖ్యమైన భాగం. తగినంత నీరు, ఓఆర్ఎస్, ఇతర ద్రవాలు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ సమస్యను నివారించవచ్చు.
ఆకలి తక్కువగా ఉంటే తేలికగా జీర్ణమయ్యే పోషకాహారం తీసుకోవాలి. శక్తి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే వ్యాయామాన్ని క్రమంగా ప్రారంభించాలి. కొంతమందికి వైద్యులు యాంటీవైరల్ మందులను సూచించే అవకాశం ఉంది. ఓసెల్టామివిర్ వంటి మందులను వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి.

Also Read: అవకాడో ఆయిల్ పేరుతో కల్తీ నూనె? ఆరోగ్యం పేరుతో మోసం.. మీరూ కొంటున్నారా?

ఏ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి?

దగ్గు లేదా జ్వరం మరింత తీవ్రమైతే వైద్య సహాయం తీసుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, తీవ్రమైన నీరసం లేదా గందరగోళం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినా వైద్య సలహా అవసరం. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు లక్షణాలు తీవ్రం కాకముందే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టవచ్చు

చాలామంది H1N1 నుంచి వారం రోజుల్లో ప్రధానంగా కోలుకుంటారు. అయితే దగ్గు, నీరసం వంటి లక్షణాలు మరికొన్ని వారాలు కొనసాగవచ్చు. లక్షణాలు క్రమంగా తగ్గుతుంటే అది సాధారణ కోలుకునే ప్రక్రియలో భాగం కావచ్చు. విశ్రాంతి, ద్రవాలు, పోషకాహారం, క్రమంగా పనులకు తిరిగి రావడం సహాయపడతాయి.

Also Read: ఎవరికీ హాని చేయలేదు అయినా జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు.. అయినవాళ్లను దూరం చేసే 7 అలవాట్లు

Tags

Related News

బెడ్‌పై పడుకోగానే నిద్ర రావడం లేదా? గంటల తరబడి ఆలోచిస్తూ ఉన్నారా? పరిష్కారం ఇదిగో

రూ.1.3 లక్షల జీతం.. నెల ఖర్చు రూ.15000 మాత్రమే.. అయినా జీవితంలో అసంతృప్తి

నామ జ్యోతిష్యం.. ఈ పేర్లు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే అదృష్టం పట్టినట్లే

ఎవరికీ హాని చేయలేదు అయినా జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు.. అయినవాళ్లను దూరం చేసే 7 అలవాట్లు

ఆరోగ్యానికి మేలు చేసే జామపండు సీజన్ వచ్చేసింది.. కొనేటప్పుడు తీయని పండు ఇలా గుర్తించండి

మార్కెట్‌లో నకిలీ చక్కెర.. ఫేక్ షుగర్‌ని ఇలా గుర్తించండి

మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ 5 ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

Big Stories

Advertisement
×