BigTV English

The Raja Saab: ‘ది రాజా సాబ్’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.? ఆ రూమర్స్‌లో నిజమెంత.?

The Raja Saab: ‘ది రాజా సాబ్’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.? ఆ రూమర్స్‌లో నిజమెంత.?

The Raja Saab: చాలావరకు పాన్ ఇండియా సినిమాలు ముందుగా అనౌన్స్ చేసిన తేదీకి విడుదల కావడం లేదు. కచ్చితంగా ఒకసారి లేదా రెండుసార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాతే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతీ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ప్రతీ సినిమా చెప్పిన తేదీకి మాత్రం విడుదల కావడం లేదు. ఇప్పుడు ‘రాజా సాబ్’ పరిస్థితి కూడా అంతే అని స్పష్టమవుతోంది. ఏప్రిల్‌లో విడుదల తేదీని ఖరారు చేసుకున్నా కూడా ‘ది రాజా సాబ్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, దీని రిలీజ్ డేట్ గురించి ఇండస్ట్రీలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


పలుమార్లు పోస్ట్‌పోన్

మారుతీ (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమానే ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమాపై మొదట్లో అసలు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. దర్శకుడిగా మారుతికి మంచి సక్సెస్ రేట్ ఉన్నా ప్రభాస్ లాంటి స్టార్ హీరోను తను ఎప్పుడూ హ్యాండిల్ చేయకపోవడంతో అసలు ఇలాంటి పాన్ ఇండియా స్టార్‌తో తను సినిమా చేయగలడా అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అలాంటిది ‘రాజా సాబ్’ నుండి ఒక గ్లింప్స్, పలు పోస్టర్లు విడుదల అవ్వగానే ఈ సినిమాపై అందరిలో నమ్మకం వచ్చేసింది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఇలాంటి లుక్‌లో ప్రభాస్‌ను ముందెప్పుడూ చూడలేదని ఈ మూవీ కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు.


ఏప్రిల్‌లో రిలీజ్ డేట్

ముందుగా ‘రాజా సాబ్’ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికే సంక్రాంతికి పోటీ పెరిగిపోయిందని, పైగా ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాలేదని అక్కడి నుండి తప్పించారు. ఎలాగైనా సమ్మర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఏప్రిల్ 10ని విడుదల తేదీగా ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఏప్రిల్‌కు వచ్చేస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఏప్రిల్‌లో కూడా ఈ మూవీ విడుదల కష్టమే అని అర్థమవుతోంది. మరి ఏప్రిల్ నుండి ఎప్పటికి ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది అనే విషయంపై ఇండస్ట్రీలో రూమర్స్ మొదలయ్యాయి.

Also Read: ‘రాబిన్‌హుడ్’లో గెస్ట్ రోల్.. డేవిడ్ వార్నర్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే.?

విడుదల లేనట్టే

‘ది రాజా సాబ్’ సినిమా ఏకంగా ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ మేకర్స్ ప్రకటించినట్టుగా ఏప్రిల్‌లోనే ఈ మూవీ విడుదల ఉండుంటే ఇప్పటికీ ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సింది. కానీ అలా జరగడం లేదు. పలు పోస్టర్లు విడుదల చేసిన తర్వాత ‘రాజా సాబ్’ టీమ్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీంతో ఏప్రిల్‌లో కూడా ఈ మూవీ విడుదల కాదని దాదాపుగా ఫిక్స్ అయినట్టే. అందుకే ఆగస్ట్‌లో ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ‘రాజా సాబ్’లో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×