Herbal Drinks: ఎండాకాలంలో చాలా మంది వడదెబ్బ బారిన పడకుండా ఉండటానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల కూల్ డ్రింక్స్, పండ్ల రసాలను తాగుతుంటారు. అయితే బయట మార్కెట్ లో లభించే డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హెర్బల్ డ్రింక్స్ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ డ్రింక్స్ వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల గుండె నాళాలు ఏవైనా బ్లాక్ అయితే ఆ సమస్య దూరం అవుతుంది.
దాల్చిన చెక్క టీ: దాల్చిన చెక్క టీ అనేది ఆరోగ్యవంతమైన డ్రింక్. సాధారణంగా దాల్చిన చెక్క చాలా ఘాటుగా ఉంటుంది. ఒక కప్పు వేడి నీటిలో దాల్చిన చెక్క వేసుకొని కలిపి తాగడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. దాల్చిన చెక్క టీ గుండెకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా వాటిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
అల్లం పాలు : ఒక గ్లాసు పాలల్లో అల్లం కలుపుకొని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గోరు వెచ్చని పాలల్లో అల్లం వేసుకొని తాగడం వల్ల కొవ్వు తగ్గడమే కాకుండా గుండె రక్త నాళాల్లో ఉండే సమస్యలు తగ్గుతాయి.
తులసి టీ : తులసిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వేడి నీటిలో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు తులసి టీ పనిచేస్తుంది.
Also Read: తులసి నీళ్లతో అందం, ఆరోగ్యం.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు!
నిమ్మ అల్లం టీ : వేడి నీటిలో కాస్త అల్లం, కొంచెం నిమ్మ రసం వేసి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వేసవిలో రక్త పోటును తగ్గిస్తుంది. రక్త నాళాలు సక్రమంగా పని చేసేలా చేస్తుంది. దీనిలో విటమిన్ సి ఉండటం వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి.