BigTV English

Snake In Shoe: షూలో పాము.. బయటకొచ్చి ఒకటే డ్యాన్స్, ఇదిగో వీడియో

Snake In Shoe: షూలో పాము.. బయటకొచ్చి ఒకటే డ్యాన్స్, ఇదిగో వీడియో

Snake In Shoe: పల్లెల్లో పాములు కలవరపెడుతున్నాయి. వానాకాలం రావడంతో పాములు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో అటవీ ప్రాంతాల్లో, కొండల్లో, పుట్టల్లో నివాసముంటూ సంచరించే పాములు.. ఇప్పుడు ఊర్లలోకి చేరుతున్నాయి. క్రిమి కీటకాలను ఆహారంగా స్వీకరించే పాములు..వ్యవసాయ పొలాల్లో వాడే రసాయనాల కారణంగా కీటకాలు, ఎలుకలు, పురుగులు అంతరించిపోతున్నాయి. దీంతో పాములు ఆహారం కోసం పల్లెబాటలు పడుతున్నాయి.


మరో వైపు ధ్వంసం అవుతున్న గుట్టలు సేధ్యంతో.. అంతరించిపోతున్న అడువులు, ఇసుక తరలింపుతో పాములు ప్రాణాలను రక్షించుకునేందుకు పల్లెల్లో చేరి జనావాసాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటున్నాయి. జనావాసాల్లో సంచరిస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోకి, పశువుల కొట్టాల్లోకి, పక్షుల పంజరాల్లోకి దూరి జంతువులను, పక్షులను కాటేస్తున్నాయి. పాముల రాకతో పల్లెల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారి జనం భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు.

భయంకరమైన అరుదైన సర్పాలు కొండ చిలువలు, నల్లత్రాచు, రక్తపింజర, నాగుపాము వంటి భయంకర సర్పాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో జనం బాబోయ్ పాములు అంటు జంకిపోతున్నారు. ఎక్కడ విషసర్పాల కాటుకు గురై ప్రాణాలు వదలాల్సి వస్తుందోనని భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటి వరకు కోతులు, కొండెంగలు ఎలుగుబంట్లు, చిరుతలు జనావాసాల్లో దూరి జనాన్ని భయ బ్రాంతులకు గురి చేయగా ఇప్పుడు విషసర్పాలు ప్రశాంతమైన పల్లెటూళ్లలో పరేషాన్ కు గురిచేస్తున్నాయి.


ఇక తాజాగా తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో.. గత రెండు రోజుల్లోనే ఇళ్లవైపు వచ్చిన 40 పాములు పట్టుబడ్డాయి. ఈ క్రమంలో కడలూరులోని చావడి ప్రాంతంలో.. ఓ తమిళుడి ఇంటికి పాము రావడం చూశాడు. అతను పామును వెంబడించేలోపే, అది అక్కడ వదిలేసిన షూలోకి వచ్చింది. వెంటనే స్నేక్ క్యాచర్ సెల్లాకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. రెస్క్యూ చేస్తుండగా.. అతనిపై దాడి చేసే ప్రయత్నం చేసింది ఆ పాము. సూటిగా పాము కళ్లలోకి చూస్తూ దానిని హిప్నటైజ్ చేశాడు. కాసేపు దానిచేత డాన్స్ వేయించాడు. ఆ వ్యక్తి మాయలో పడిన పాము కాస్త అజాగ్రత్తగా మారిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి పాము తల పట్టేసుకున్నాడు. ఆ పామును నేర్పుగా పట్టుకుని సురక్షితంగా కాపాడాడు.

Also Read: ఒకే బైకుపై 8 మంది ప్రయాణం.. రీల్ పిచ్చికి మందేసిన పోలీసులు

సాధారణంగా వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని, షూ వేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకుంటే.. మంచిదని సెల్లా చెప్పారు. షూ ధరించే ముందు దుమ్ము దులపడం ఎందుకు అవసరమో వివ‌రించారు. ముఖ్యంగా వర్షాకాలంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అని సెల్లా తెలిపారు.

 

Related News

Viral Video: సెల్ఫీకి ఓ వ్యక్తి ప్రయత్నం.. తోసి తిట్టేసిన జయాబచ్చన్, వైరల్ వీడియో

Viral Video: ఆహా.. తందూరి రోటీలో బల్లి.. దోరగా వేగిపోయి.. కస్టమర్‌కు షాక్!

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Big Stories

×