Uric Acid : ఈ రోజుల్లో, చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం అనే సమస్య సర్వసాధారణమైపోయింది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం విపరీతంగా పెరిగి, మూత్రపిండాలు దానిని పూర్తిగా తొలగించలేనప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి, వాపు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అధిక రక్తపోటు కిడ్నీలను దెబ్బతీస్తుంది.
యూరిస్ యాసిడ్ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే. అది ఆర్థరైటిస్ (గౌట్) వంటి తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి, దాని పెరుగుదలకు కారణాలు , దాని 4 ముఖ్యమైన లక్షణాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి ?
యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఏర్పడే ఒక రసాయన సమ్మేళనం. ఇది ప్యూరిన్ అనే మూలకం విచ్ఛిన్నం అవడం ద్వారా ఏర్పడుతుంది. మాంసం, చేపలు, బీన్స్ , ఆల్కహాల్ వంటి కొన్ని ఆహారాలలో ప్యూరిన్లు ఉంటాయి. సాధారణంగా.. మూత్రపిండాలు దానిని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. కానీ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినప్పుడు లేదా మూత్రపిండాలు దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేనప్పుడు, అది రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా శరీరంలో నొప్పి, వాపు, దృఢత్వం సమస్యలు మొదలవుతాయి.
యూరిక్ యాసిడ్ యొక్క 4 ప్రధాన లక్షణాలు:
1. కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు:
యూరిక్ యాసిడ్ పెరుగుదల యొక్క మొదటి ప్రభావం కీళ్లపై ఉంటుంది. దీనివల్ల కాలి వేళ్లు, మోకాలు, చీలమండలు, మణికట్టులలో తీవ్రమైన నొప్పి, వాపు వస్తుంది. ఈ నొప్పి తరచుగా రాత్రిపూట పెరుగుతుంది. కొన్నిసార్లు భరించలేనిదిగా మారుతుంది.
2. ఎముకలలో దృఢత్వం:
మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంటే.. ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ కాళ్ళు, శరీరంలోని ఇతర భాగాలలో బిగుతుగా, బరువుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ సమస్య చాలా తీవ్రంగా మారుతుంది. అంతే కాకుండా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఒక తీవ్రమైన వ్యాధి. కాబట్టి మీ శరీరంలో అలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి మీ ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
3. పాదాలలో మంట, ఎరుపుదనం:
యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు.. అది కీళ్లలో పేరుకుపోయి వాపుకు కారణమవుతుంది. దీని కారణంగా.. క్క చర్మం ఎర్రగా మారుతుంది. అంతే కాకుండా దీనిని కొద్దిగా తాకినా నొప్పి అనుభూతి చెందుతుంది.
4. తరచుగా మూత్రవిసర్జన:
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే ప్రధాన లక్షణం తరచుగా మూత్రవిసర్జన చేయడం. శరీరం యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడానికి ప్రయత్నించినప్పుడు, తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగితే.. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి కూడా అనిపించవచ్చు.
5. యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు:
యూరిక్ యాసిడ్ పెరగడానికి మన తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణం కావచ్చు. మాంసం, పప్పులు, జంక్ ఫుడ్ , తియ్యటి డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇది పెరుగుతుంది. ఊబకాయం, నీరు లేకపోవడం, మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. దీనిని నియంత్రించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం, పుష్కలంగా నీరు, క్రమం తప్పకుండా వ్యాయామం ,ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం.
యూరిక్ యాసిడ్ నియంత్రణ:
మీరు పెరిగిన యూరిక్ యాసిడ్ సమస్యను నివారించాలనుకుంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దానిని మీరు నియంత్రించవచ్చు.
తగినంత నీరు త్రాగండి: రోజంతా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగండి. తద్వారా యూరిక్ యాసిడ్ శరీరం నుండి సులభంగా తొలగించబడుతుంది.
సమతుల్య ఆహారం తీసుకోండి: ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
Also Read: సమ్మర్‌లో.. కూల్ కూల్‌గా ఐస్ ఫేషియల్
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి: వేయించిన, ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కాబట్టి వాటిని తినకుండా ఉండండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం, యోగా లేదా నడవడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
ఆల్కహాల్ , కూల్ డ్రింక్స్ నివారించండి: ఆల్కహాల్ ,సోడా పానీయాలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా పెంచుతాయి. కాబట్టి వీటిని వీలైనంత తక్కువగా త్రాగాలి.