BigTV English

Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Gastric Problem: సరైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవనశైలి, జీర్ణవ్యవస్థ సమస్యల కారణంగా కడుపులో గ్యాస్ సమస్య పెరుగుతోంది. గ్యాస్, కడుపు నొప్పితో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించడం ద్వారా మీరు ఈ సమస్యను వదిలించుకోవచ్చు. మరి ఏ హోం రెమెడీస్ గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. వాటిని ఎలా తయారు చేసుకుని ఉపయోగించాలనే విధానాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


వాము , నల్ల ఉప్పు:
వాములో జీర్ణశక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఇది కడుపులో ఏర్పడిన అదనపు గ్యాస్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. గ్యాస్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం పొందాలంటే, అర చెంచా వాము తీసుకుని అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగాలి. ఈ రెసిపీ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అంతే కాకుండా గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇంగువ యొక్క ఉపయోగం:
కడుపులోని గ్యాస్, అజీర్తిని తక్షణమే నయం చేయడంలో ఇంగువ ఒక అద్భుతమైన ఔషధం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలుపుకుని తాగడం వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా ఇంగువను నీళ్లలో కలిపి పొట్టపై రాసుకుంటే కూడా మేలు జరుగుతుంది. ఈ రెసిపీ పొత్తికడుపు వాపు, గ్యాస్ నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.


అల్లం టీ:
అల్లం ఒక సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. ఇది జీర్ణవ్యవస్థను ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా గ్యాస్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అల్లం టీ తయారు చేయడానికి ఒక కప్పు నీటిలో తాజా అల్లం ముక్కలను వేసి మరిగించాలి. దీన్ని వడగట్టి అందులో కొద్దిగా తేనె కలుపుకుని వేడి వేడిగా తాగాలి. అల్లం టీ వల్ల గ్యాస్ నొప్పిని తగ్గించడమే కాకుండా పొట్ట తేలికగా మారుతుంది.

పుదీనా రసం:
పుదీనా ఆకులు కడుపులో గ్యాస్, అజీర్ణాన్ని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తాజా పుదీనా ఆకులను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయండి. దీనికి కొద్దిగా నిమ్మరసం, నల్ల ఉప్పు కలపండి.తర్వాత ఈ మిశ్రమాన్ని త్రాగాలి. పుదీనా రసం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకువండా కడుపు సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.

Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే మీ పళ్లు మెరిసిపోతాయ్

వేడి నీటి తీసుకోవడం:
గ్యాస్ , అజీర్ణం సమస్యను తొలగించడానికి వేడి నీరు సులభమైన, సమర్థవంతమైన పరిష్కారం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజితమవుతుంది. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది. గ్యాస్ ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×