BigTV English

Pigmentation: ఇలా చేస్తే.. ముఖంపై మంగు మచ్చలు మాయం

Pigmentation: ఇలా చేస్తే.. ముఖంపై మంగు మచ్చలు మాయం

Pigmentation: మారుతున్న జీవనశైలితో పాటు చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మనం కూడా ప్రభావితం అవుతుంది. ముఖంపై మొటిమలు , మంగు మచ్చల వంటివి కూడా వస్తుంటారు. వయస్సు పెరిగే కొద్దీ చాలా మందిలో హైపర్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా ప్రారంభం అవుతుంటాయి. వీటి వల్ల ముఖంపై కొన్ని భాగాలు నల్లగా కనిపిస్తుంటాయి. చర్మంలో మెలనిన్ ఉత్పత్తి కానప్పుడు పిగ్మంటేషన్ వస్తుంది. మెలనిన్ జుట్టు, చర్మం కు రంగునిస్తుంది. చర్మంపై మెలనిన్ స్థాయిలు అసమతుల్యంగా ఉన్నప్పుడు అది చర్మంపై నల్లటి మచ్చలు వచ్చేలా చేస్తుంది.


హైపర్ పిగ్మెంటేషన్ రకాలు:
మెలస్మా: ఇది తరచుగా గర్భం లేదా హార్మోన్ల చికిత్స వంటి హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తుంది. ఇది ముఖంపై గోధుమ రంగు ప్యాచ్‌లుగా కనిపిస్తుంది.

సన్‌స్పాట్‌లు: సూర్యకిరణాలకు ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వీటిని వయసు మచ్చలు అని కూడా అంటారు.


పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్పిగ్మెంటేషన్: గాయం, చికాకు, మొటిమలు లేదా అలెర్జీ తర్వాత చర్మంపై డార్క్ మార్క్స్ ఏర్పడతాయి.

పిగ్మెంటేషన్  రావడానికి గల కారణాలు ఏమిటి ?

సూర్యకిరణాల ప్రభావం: సూర్యుని అతినీలలోహిత కిరణాలకు గురికావడం కావడం వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతే కాకుండా వయస్సు పెరుగుతున్నా కొద్దీ చర్మం యొక్క సహజ హైపర్పిగ్మెంటేషన్ పెరుగుతుంది.

హార్మోన్ల మార్పులు: వయస్సుతో పాటు హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్, మెలనిన్ ఉత్పత్తిని అసమతుల్యతంగా చేస్తుంది.

వృద్ధాప్యం యొక్క ప్రభావం:వయస్సు పెరుగుతున్నా కొద్దీ.. చర్మం బలహీనంగా మారుతుంది. దీని కారణంగా పిగ్మెంటేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వల్ల చర్మంపై మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి.

పర్యావరణ ప్రభావం: కాలుష్యం, టాక్సిన్స్ చర్మ వర్ణాలను ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఎక్కువ ప్రభావం చూపుతాయి.

జన్యుపరమైన సమస్య: కొంతమందిలో హైపర్పిగ్మెంటేషన్ సమస్య జన్యుపరమైనది. ఇది వయస్సుతో స్పష్టంగా కనిపిస్తుంది.

వీటిని వాడితే పిగ్మెంటేషన్ మాయం: 

హైపర్ పిగ్మెంటేషన్ సహజంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సహనం, క్రమబద్ధత అవసరం.

అలోవెరా: అలోవెరా జెల్‌లో ఉండే అలోసిన్ సమ్మేళనం మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీన్ని నేరుగా ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మంగు మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

నిమ్మకాయ , తేనె: నిమ్మకాయలో విటమిన్ సి , సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. తేనె తేమను అందిస్తుంది. నిమ్మరసం , తేనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

పసుపు: పసుపులో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మ కాంతిని పెంచుతుంది. అంతే కాకుండా పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. పసుపు పొడిని పాలు లేదా పెరుగుతో కలిపి మాస్క్‌ను తయారు చేసి 15 నిమిషాలు అప్లై చేయండి.

గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ బ్యాగ్‌ని చల్లార్చి నల్ల మచ్చలు ఉన్న చోట అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. తక్కువ సమయంలోనే నల్ల మచ్చలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

బంగాళాదుంప రసం: బంగాళాదుంప రసం చర్మంపై మెరుపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. పచ్చి బంగాళాదుంప తురుము నుండి రసం తీసి నేరుగా నల్ల మచ్చలు ఉన్న చోట అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఎంతటి నల్ల మచ్చలు అయినా ఈజీగా తగ్గిపోతాయి.

Also Read: హెన్నా అవసరమే లేదు.. ఈ హెర్బల్ హెయిర్ కలర్‌తో క్షణాల్లోనే తెల్లజుట్టు మాయం

విటమిన్ ఎ: విటమిన్ ఎ క్యాప్సూల్‌ను పగలగొట్టి, ప్రభావిత ప్రాంతంలో జెల్‌ను రాయండి. ఇది చర్మాన్ని రిపేర్ చేయడంతో పాటు తేమను కూడా అందిస్తుంది. అంతే కాకుండా నల్ల మచ్చలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×