BigTV English

Skin Allergy: అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Skin Allergy: అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Skin Allergy: అలర్జీ అనేది సాధారణ సమస్య. అలెర్జీ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా దుమ్ము, కాలుష్యం, రసాయనాలు లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా అలర్జీ రావచ్చు. ఇలాంటి సమయంలో చర్మంపై దురదతో పాటు ఎర్రటి మచ్చలు, చికాకు వాపు కూడా కలుగుతాయి. అలర్జీతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఖరీదైన క్రీములు వాడకుండా కొన్ని సాధారణ హోం రెమెడీస్ కూడా వాడవచ్చు. ఇవి అలర్జీని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తాయి.


చర్మ అలర్జీలకు రెమెడీస్:

అలోవెరా జెల్ :
అలోవెరా జెల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అలర్జీని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఇందుకోసం తాజా కలబంద పేస్టును తీసుకుని అలర్జీ ఉన్న చోట అప్లై చేయాలి. తర్వాత దీనిని 20 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి. ఇది దురద, చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కూడా చల్లగా చేస్తుంది. అలర్జీతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో రోజుకు రెండు సార్లు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది.


కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ తో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. చర్మ అలర్జీ వల్ల కలిగే దురద , చికాకు తగ్గించడానికి రాత్రి పడుకునే ముందు అలర్జీ ఉన్న చోట కొబ్బరి నూనెను అప్లై చేయండి. ఆయిల్ చర్మం లోపలికి ఇంకిపోయేలా సున్నితంగా మసాజ్ చేయండి. ఇది చర్మం యొక్క తేమను కాపాడుతుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లను కూడా నివారించడంలో సహాయపడుతుంది.

బేకింగ్ సోడా :

బేకింగ్ సోడా అలర్జీని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మంపై కలిగే దురదను కూడా తగ్గిస్తుంది. ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను కొంచెం నీటితో కలిపి పేస్ట్ లాగా చేయండి. తర్వాత దీనిని అలర్జీ ఉన్న చోట అప్లై చేయండి. 10-15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి. ఇది చర్మం యొక్క PH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లు నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: క్షణాల్లోనే ముఖం మెరిసిపోవాలా ? అయితే ఈ టిప్స్ పాటించండి

ఓట్ మీల్ :
సాధారణంగా ఓట్ మీల్‌లో ఉండే లక్షణాలు అలర్జీని తగ్గిస్తాయి. ఒక కప్పు ఓట్ మీల్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి. లేదా ప్రభావితం ప్రాంతంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇది చర్మం యొక్క మంటను తగ్గిస్తుంది. అంతే కాకుండా దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రెమెడీని రోజుకు ఒక సారి అప్లై చేయడం వల్ల త్వరగా అలర్జీ సమస్య నుండి తగ్గించుకోవచ్చు.

వేపాకు పేస్ట్ :

వేపాకులో ఉండే గుణాలు అలర్జీని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. అంతే కాకుండా వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇవి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా పనిచేస్తుంది.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×