BigTV English

Russia War Indian Soldiers : ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ సైనికులు గల్లంతు.. ఉద్యోగాల పేరిట రష్యాలో మోసం

Russia War Indian Soldiers : ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ సైనికులు గల్లంతు.. ఉద్యోగాల పేరిట రష్యాలో మోసం

Russia War Indian Soldiers | రష్యా సైనిక దళాల్లో 18 మంది భారతీయులు ఉన్నారని, వారిలో 16 మంది ఆచూకీ గల్లంతైనట్లు ఆ దేశం నుంచి సమాచారం అందిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభకు ఈ విషయంలో లిఖితపూర్వక సమాధానం అందజేశారు. 18 మందిలో తొమ్మిది మంది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని ఆయన తెలిపారు. ప్రస్తుత ఘర్షణల్లో రష్యా సైనిక దళాల్లో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.


రష్యా సైనిక దళాల్లో ఉన్న భారతీయుల గురించి తాజా సమాచారాన్ని అందజేసి, వారిని త్వరగా మాతృదేశానికి తిరిగి పంపించేలా చూడాలని కోరినట్లు ఆయన వివరించారు. అలాగే, రష్యా సైన్యంలో సేవలు ముగిసిన 97 మంది భారతీయులను ఏయే రాష్ట్రాలకు పంపించారో కూడా ఆయన వెల్లడించారు.

రష్యాలో జాబ్స్ పేరిట మోసం.. ఏజెంట్ల చేతిలో యువకులు బలి
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలై దాదాపు మూడేళ్లు పూర్తి కానున్నాయి. ఈ యుద్ధానికి రష్యా, ఉక్రెయిన్ వాసులు ఎందరో బలయ్యారు. ఈ వివాదానికి ఏమాత్రం సంబంధం లేని భారతీయులు కూడా సమిధలుగా మారడం స్వదేశంలో కలకలం రేపుతోంది. రష్యాలో జాబ్స్ పేరిట కొందరు ఏజెంట్లు యూపీ యువకులను ఆశ పెట్టి యుద్ధం రంగంలోకి దింపడంపై ప్రస్తుతం ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.


ఆజమ్ గఢ్, మావ్ జిల్లాకు చెందిన పలువురు యువకులను కొందరు ఏజెంట్లు నెలకు రూ.2 లక్షల శాలరీ ఆశ చూపి ఉచ్చులోకి దింపారు. రష్యాలో సెక్యూరిటీ గార్డులు, వంటవాళ్లు, హెల్పర్లుగా జాబ్స్ ఉన్నాయని చెప్పి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్నా వారికి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారు. 2024లో ఇలా 13 మంది వెళ్లగా వారిలో ఆజంగఢ్‌కు చెందిన కన్హయ్యా యాదవ్, శ్యామ్‌సుందర్, మావ్ జిల్లాకు చెందిన సునీల్ యాదవ్ యుద్ధ రంగంలో కన్నుమూశారు. గాయాల పాలై కారేశ్ యాదవ్, బ్రిజేశ్ యాదవ్ అదృష్టవశాత్తూ స్వదేశానికి చేరుకోగలిగారు.

Also Read: అమెరికా చైనా మధ్య సీరియస్ ట్రేడ్‌ వార్‌.. ఇండియాకు జాక్‌పాట్!

మరో ఎనిమిది మంది వివరాలు ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఖోజాపూర్ గ్రామం నుంచి రష్యా వెళ్లిన యోగేంద్ర యాదవ్ ఆచూకీ ఇంత వరకూ తెలియరాలేదు. ‘‘వినోద్ యాదవ్ అనే వ్యక్తి నా తమ్ముడిని ఉచ్చులోకి దింపాడు, సెక్యూరిటీ గార్డుగా జాబ్ ఇప్పిస్తానని చెప్పి రష్యా సరిహద్దుకు తరలించారు’’ అని అతడి సోదరుడు చెప్పుకొచ్చారు. గతేడాది జవవరిలో రష్యా వెళ్లిన యోగేంద్ర చివరిసారిగా మేలో కుటుంబసభ్యులతో మాట్లాడాడు. ఆ తరువాత అతడి నుంచి ఎటువంటి కబురు లేకపోవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. తమకు సాయపడాలంటూ ప్రభుత్వాన్ని అర్థిస్తు్న్నారు. అజారుద్దీన్ ఖాన్‌ది కూడా దాదాపు ఇదే గాథ. తన కొడుకుకు సెక్యూరిటీ గార్డుగా నెలకు రూ.2 లక్షల శాలరీ అని చెప్పి ఉచ్చులోకి లాగారని అతడి తల్లి వాపోయింది. అక్కడ చేరుకున్నాక అతడికి కొద్ది రోజుల పాటు శిక్షణ ఇచ్చి యుద్ధరంగానికి పంపారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు యుద్ధంలో పాల్గొంటున్నాడని తెలిసి అజారుద్ధీన్ తండ్రికి ఏకంగా గుండెపొటు వచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో అజారుద్దీన్ తన తల్లితో మాట్లాడాడు. నాటి నుంచి కొడుకుకు సంబంధించిన ఏ సమాచారం అందక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది.

భారత విదేశాంగ శాఖ ప్రకారం, రష్యాలో మొత్తం 126 మంది భారతీయులు చేరారు. వారిలో 96 మంది ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు. 12 మంది యుద్ధ రంగంలో మరణించగా మరో 16 మంది ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఏజెంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ బిడ్డలకు ఇంటికి చేర్చాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

అయితే, సైన్యంలో విదేశీయులను చేర్చుకునే విధానానికి రష్యా రక్షణ శాఖ గతేడాది ఆగస్టులోనే ముగింపు పలికింది. కానీ అప్పటికే అనేక కుటుంబాలకు జరగ వలసిన నష్టం జరిగిపోయింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×