Scorpion Bite: తేలు పేరు వింటేనే చాలామందికి గుండె దడ పుడుతుంది. తేలు కనిపిస్తే అల్లంత దూరం నుంచే పరుగులు పెడతాము. దానికి ప్రధాన కారణం తేలు కాటు. అవును, తేలు కుడుతుందనే భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి విరుగుడు మనకు తెలియదు. సాధారణంగా వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టాల్సిందేనని అనుకుంటాం. అయితే మీకు తెలుసా? ఆసుపత్రికి వెళ్లకుండానే మన ఇంట్లోనే తేలు కాటుకు ఒక అద్భుతమైన గృహ చిట్కా ఉంది. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తేలు విషం ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వాటిని పాటిస్తే తేలు కాటు వల్ల కలిగే నొప్పి, మంట, వాపు తగ్గిపోతాయి. అది ఎలా అంటే, ఇప్పుడు తెలుసుకుందాం.
తేలు కుట్టిన చోట ఇలా చేయండి!
తేలు కుట్టిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్రమైన మంట, గుచ్చినట్టు నొప్పి వస్తుంది. శరీరంలో విషం వ్యాపిస్తుందేమోనని మనసులో ఆందోళన మొదలవుతుంది. ఇలాంటి సందర్భంలో జీలకర్ర తీసుకుని బాగా నూరాలి. దానిలో కొద్దిగా తేనె, కొంచెం ఉప్పు, అలాగే ఒక చుక్క నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట పూసి, పైన గుడ్డ(క్లాత్)తో కట్టు కడితే మంట చాలా వరకు తగ్గిపోతుంది. ఈ నాలుగు పదార్థాల కలపడంతో ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది.
Also Read: CIBIL Score: క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే సిబిల్ స్కోరు తగ్గుతుందా? పూర్తి వివరాలు!
జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యితో విషం ఎక్కదా?
జీలకర్ర శరీరంలోని విష తత్వాలను తగ్గించే శక్తి కలిగినది. దానిని నూరి వేస్తే విష ప్రభావం తగ్గుతుంది. తేనె యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుంది. మంట, వాపు తగ్గడంలో తేనె చాలా ఉపశమనం ఇస్తుంది. ఉప్పు రక్తప్రసరణను నియంత్రించి గాయం లోపలికి విషం వెళ్లకుండా కాపాడుతుంది. నెయ్యి చల్లదనం కలిగించి మంట తగ్గించడమే కాకుండా ఆ ప్రదేశాన్ని తేమగా ఉంచుతుంది. ఇలా ఈ నాలుగు పదార్థాలు కలిసినప్పుడు సహజమైన ఓ ఔషధం తయారవుతుంది.
అప్పట్లో ఇలా చేసేవారా!
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేననప్పుడు మన పూర్వీకులు ఇలాంటి గృహ చికిత్సలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. తేలు కుట్టిన వెంటనే ఈ మందు వేసి, నొప్పి తగ్గకపోతే లేదా శరీరం వణుకుతున్నట్లు, నీరసంగా అనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తేలు విషం ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు.
తేలు కాటు చిన్నపాటి అయితే, కుట్టిన చోట ఈ జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పి, వాపు తగ్గి బాధితుడు కాస్త ఉపసమనం ఉంటుంది. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సహజంగా పనిచేసే చికిత్స. అందుకే పెద్దలు చెప్పిన ఈ చిట్కాను ఇళ్లలో తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇది చిట్కా చిన్నదే కానీ, బలమైన మందు, తేలు కాటు సమయంలో ప్రాణ రక్షణలా నిలుస్తుంది.