OTT Movie : హారర్ సినిమాలు ఇప్పుడు అన్ని భాషలలో ట్రెండ్ అవుతున్నాయి. ఓటీటీలో వీటి కోసం ఎదురుచూసే అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఈ దెయ్యాల స్టోరీలను ఇండోనేషియన్ మేకర్స్ ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. చేతబడి, దెయ్యాల కంటెంట్ ఉన్న సినిమాలకు ఫాంటసీ, ట్విస్ట్లు, అడ్వెంచర్ వంటి ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని ఎంగేజింగ్ గా ఉంచుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో స్టోరీ ఒక నృత్యం చుట్టూ తిరుగుతుంది. ఒక దెయ్యం దీనిని ఆచారంలో భాగంగా నడుపుతుంటుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఇండోనేషియన్ సూపర్‌నాచురల్ హారర్ మూవీ పేరు ‘డాన్సింగ్ విలేజ్ : ది కర్స్ బిగిన్స్’ (Dancing Village: The Curse Begins). 2024 లో వచ్చిన ఈ సినిమాకి కిమో స్టాంబోయెల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2022లో విడుదలైన KKN di Desa Penariకి ప్రీక్వెల్‌గా వచ్చింది. ఇది ఇండోనేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా రికార్డ్ సృష్టించింది. ఇందులో ఔలియా సారా (బదరవుహి), మౌడీ ఎఫ్రోసినా (మీలా), జౌర్డీ ప్రణత (యూడా), అర్దిత్ ఎర్వంధ (ఆర్య), క్లారెస్టా తౌఫన్ కుసుమరిన (రతీ) ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 2024ఏప్రిల్ 11 న ఇండోనేషియా సినిమాహాళ్లలో విడుదలైంది. ఈ స్టోరీ ఇండోనేషియన్ జానపద కథలు, సూపర్‌నాచురల్ నమ్మకాల చుట్టూ తిరుగుతుంది. 2 గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.7/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా Amazon Prime Video, Apple TV, Google Play Movies లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మీలా అనే యువతి, తన తల్లి ఒక వింత రోగంతో బాధపడుతోందని తెలుసుకుంటుంది. ఈ రోగం వల్ల ఆమె క్రమంగా కోమాలోకి జారుకుంటుంది. స్థానిక షమన్ సలహాతో, మీలా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక కంకణాన్ని “డాన్సింగ్ విలేజ్”కి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఈ గ్రామం జావా ద్వీపం తూర్పు చివరన ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. మీలా తన కజిన్ యూడా, స్నేహితులు జిటో, ఆర్యతో కలిసి ఈ ప్రయాణం మొదలుపెడుతుంది. వీళ్ళు గ్రామానికి చేరుకున్నప్పుడు, స్థానిక మహిళ అయిన రతీ ఇంట్లో ఆశ్రయం పొందుతారు. అయితే ఆ సమయంలో గ్రామ పెద్ద లేనట్లు తెలుస్తుంది. అప్పటినుంచి గ్రామంలో వింత సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. అక్కడ మీలా బదరవుహి అనే దుష్ట శక్తి నీడలను, దాని ప్రభావాన్ని చూస్తుంది. అది ఈ గ్రామంపై ఆధిపత్యం చెలాయిస్తుంటుంది.
రతీ తల్లికి కూడా మీలా తల్లికి ఉన్న రోగంతోనే బాధపడుతోందని, ఇది బదరవుహి శాపంతో ముడిపడి ఉందని తెలుస్తుంది. బదరవుహి అనే దుష్ట శక్తి , ఒక సాంప్రదాయ నృత్య ఆచారం ద్వారా గ్రామాన్ని తన ఆధీనంలో పెట్టుకుంటుంది. ఇప్పుడు మీలా తన దగ్గర ఉన్న కంకణాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే మీలాను ఈ ఆచారంలో బలి అవ్వడానికి ఆ దుష్ట శక్తి ప్రేరేపిస్తుంది. ఇక కథ క్లైమాక్స్ లో ఊహించని మలుపులు తిరుగుతాయి. చివరికి మీలా ఈ దుష్ట శక్తి నుంచి బయట పడుతుందా ? ఈ కంకణం వెనుక ఉన్న స్టోరీ ఏంటి ? ఆ గ్రామంలో నృత్యం ఒక ఆచారంగా ఎందుకు మారింది ? ఇంతకీ ఈ బదరవుహి అనే దుష్ట శక్తి ఎవరు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : బ్యూటీ పార్లర్ ముసుగులో అమ్మాయిల అరాచకం… మస్ట్ వాచ్ మలయాళ మూవీ