Kissing Benefits: కిస్ అంటే తెలియని వారుంటారా? అబ్బో భలే సిగ్గు పడుతున్నారే.. ఇందులో పలు రకాల కిస్ లు ఉన్నాయి. కిస్ అనేది ప్రేమను వ్యక్తపరిచే ఇక భావం. తల్లి తన బిడ్డకు ప్రేమతో ముద్దు పెట్టడం వేరు. అలాగే ప్రేమలో ఉన్న యువతీ, యువకులు కిస్ చేసుకొనే విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ కామన్ కిస్ అయినప్పటికీ భావం వేరు. అయితే కిస్ చేస్తే లాభామా? నష్టమా? అసలు ఎలాంటి ప్రభావం మనపై చూపుతుందో తెలుసుకుందాం.
కిస్ ను అచ్చ తెలుగులో చుంబనం అంటారు. ఇదొక ప్రేమ, ఆప్యత, ఆత్మీయత వ్యక్తీకరణకు ఉపయోగించే ఒక శారీరక చర్య. ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, పరిస్థితులకు అనుగుణంగా భిన్నంగా పరిగణించబడుతోంది. అయితే శాస్త్రీయంగా పరిశీలిస్తే, కిస్ చేయడం వల్ల కొన్ని ఆరోగ్యానుకూల ఫలితాలు ఉన్నట్లే, నష్టాలు కూడా లేకపోలేదు. అందుకే ఇష్టారీతిన కిస్ చేశారనుకోండి.. కొన్ని సార్లు కటకటాల్లోకి వెళ్లే పరిస్థితి కూడా వస్తుంది.
కిస్ వల్ల లాభాలు
సాధారణంగా విదేశాలలో కిస్ అనేది కామన్ గా మారింది. ఏ శుభకార్యం జరిగినా అక్కడ హగ్, కిస్ లు కామన్. కానీ రానురాను ఈ కిస్ గోల మన దేశానికి తాకిందని చెప్పవచ్చు. కొందరు ప్రేమతో చేసే కిస్ లు వేరు. కానీ లవర్స్ మాత్రం కిస్ కు కొత్త అర్థం చెబుతున్న పరిస్థితి. ఇక కిస్ వల్ల కలిగే లాభాల్లోకి వెళితే.. ప్రధానంగా స్ట్రెస్ తగ్గుతుందని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కిస్ చేయడం ద్వారా ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనలో మానసిక శాంతి భావనలు కలిగిస్తాయి. కిస్ సమయంలో గుండె వేగం పెరగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది హృదయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇద్దరు వ్యక్తులు కిస్ చేయడం ద్వారా మిక్స్ అయ్యే లాలాజలం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాలకు రేసిస్టెన్స్ అభివృద్ధి చేస్తుంది. భౌతికంగా సన్నిహితంగా ఉండే ఈ చర్య ప్రేమ, విశ్వాసానికి బలమైన సంకేతంగా పనిచేస్తుంది. అంతేకాదు లాలాజలం పెరిగి, దంతాలలో ఉండే కొన్ని హానికర బ్యాక్టీరియా తొలగిపోతుంది. అయితే ఇది పరస్పర శుభ్రతపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.
కిస్ వల్ల నష్టాలు..
కిస్ చేస్తే ఇన్ని లాభాలు ఉన్నట్లే, నష్టాలు ఉన్నాయి. హెర్పీస్, మోనోన్యూక్లియోసిస్, ఇన్ఫ్లుయెంజా, కలరా వంటి వ్యాధులు లాలాజలం ద్వారా వ్యాపించే అవకాశం ఉంది. ఒకరికి నోరు సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉంటే, అవి మరో వ్యక్తికి సులభంగా సంక్రమించవచ్చు.
ఒకరి నోటి శుభ్రత సరైన విధంగా లేకపోతే, వారి నుండి ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇది దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు అనుమతి లేకుండా కిస్ చేస్తే, న్యాయ పరంగా, మర్యాద పరంగా తీవ్ర పరిణామాలుంటాయి. ఇది లైంగిక వేధింపుగా కూడా పరిగణించబడుతుంది.
Also Read: Notice to eCommerce sites: ఈ కామర్స్ లో పాక్ జెండాలు.. మరీ ఇంత దిగజారాలా? కేంద్రం సీరియస్
కిస్ అనేది ఒక వ్యక్తిగత, శారీరక భావోద్వేగ పరమైన చర్య. ఇది ప్రేమను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే ఒక సాధనం అయినప్పటికీ, దీన్ని అపహాస్యం చేయకూడదన్నది పలువురి అభిప్రాయం. ఆరోగ్య పరిరక్షణ, పరస్పర అంగీకారం, వ్యక్తిగత గౌరవం ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కిస్ చేయాలి. సరైన సందర్భం, సరైన వ్యక్తి, సరైన అనుమతితో మాత్రమే ఈ చర్య జరగాలి. లేకుంటే ఊసలు లెక్కపెట్టాల్సిందే. మొత్తం మీద అనుమతి ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే, కిస్ తో లాభాలు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు.