E-Paper
Advertisement

చర్మ సమస్యలు, అలర్జీలతో బాధపడుతున్నారా? అసలు కారణం మీ బెడ్‌షీట్లే కావచ్చు!

చర్మ సమస్యలు, అలర్జీలతో బాధపడుతున్నారా? అసలు కారణం మీ బెడ్‌షీట్లే కావచ్చు!
Advertisement

Bed Sheets Hygiene: రోజంతా పనిచేసి ఇంటికి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోవడానికి బెడ్‌పై వాలుతుంటాం. కానీ మనం రోజూ పడుకునే బెడ్ షీట్లు ఎంతవరకు శుభ్రంగా ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది తీరిక లేని పనివల్ల లేదా బద్ధకం వల్ల నెలకొకసారి లేదా రెండు వారాలకోసారి బెడ్ షీట్లు మారుస్తుంటారు. కానీ ఇది అసలు మంచి పద్ధతి కాదు. మనం పడుకున్నప్పుడు శరీరం నుండి వచ్చే చెమట, మృతకణాలు బెడ్ షీట్లపై పేరుకుపోతాయి. ఇవి కంటికి కనిపించని నలుసులు, బ్యాక్టీరియా పెరగడానికి దారితీస్తాయి.

వారానికి ఒకసారి తప్పనిసరి:

సాధారణంగా ప్రతి వారం బెడ్ షీట్లు ఉతకడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిద్రలో మనకు తెలియకుండానే చెమట పడుతుంది. దీనికి తోడు చర్మం నుండి రాలే మృతకణాలు ఫ్యాబ్రిక్‌లోకి చేరతాయి. వీటివల్ల బెడ్ షీట్లలో సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. అందుకే వారానికి ఒకసారి షీట్లు మార్చడం వల్ల ఈ సమస్యను సులభంగా అరికట్టవచ్చు.

Advertisement

Also Read: ఆఫీస్ ఉద్యోగులకు సైలెంట్ వార్నింగ్.. రోజంతా కూర్చుంటే ఈ క్యాన్సర్ ముప్పు తప్పుదా?!

ఆరోగ్యంపై పడే ప్రభావం:

సమయానికి బెడ్ షీట్లు మార్చకపోతే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దురద, అలర్జీలు, ఏక్జెమా వంటి ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా గాలిలోని ధూళి, పుప్పొడి కూడా బెడ్ షీట్లపై చేరడం వల్ల శ్వాసకోశ సమస్యలు, నిద్రలేమి తలెత్తుతాయి. క్రమం తప్పకుండా షీట్లు మార్చడం వల్ల ప్రశాంతమైన నిద్రతో పాటు మంచి ఆరోగ్యం మీసొంతమవుతుంది.

వ్యక్తిగత అలవాట్లు:

Advertisement

మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా, లేదా మీకు రాత్రి వేళల్లో బాగా చెమట పట్టే అలవాటు ఉన్నా ప్రతి మూడు లేదా నాలుగు రోజులకోసారి బెడ్ షీట్లు మార్చడం మంచిది. అలాగే వర్షాకాలం, ఎండాకాలంలోనూ త్వరగా షీట్లు మార్చాలి. శీతాకాలంలో చల్లని వాతావరణం ఉంటే ఏడు నుండి పది రోజుల వరకు సమయం తీసుకోవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు:

మీకు క్రమం తప్పకుండా తుమ్ములు రావడం, చర్మంపై దురదగా అనిపించడం జరుగుతుంటే వెంటనే బెడ్ షీట్లను మార్చాలి. మీ శరీర స్పందనను బట్టి ఉతికే సమయాన్ని సరిచూసుకోవడం ముఖ్యం. ఇంటి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా బెడ్ షీట్ల శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

Also Read: పళ్ల ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు పెరుగుతుందా? 1.90 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో ఏం తేలిదంటే!

Tags

Related News

రోజూ ఈ 5 పదార్థాలు తింటే చాలు.. లివర్‌లో కొవ్వు చకచకా కరిగిపోతుంది!

ఆఫీస్ ఉద్యోగులకు సైలెంట్ వార్నింగ్.. రోజంతా కూర్చుంటే ఈ క్యాన్సర్ ముప్పు తప్పుదా?!

సైన్స్‌కే సవాల్ విసిరిన పూరీ ఆలయం.. గాలికి విరుద్ధంగా జెండా ఎగరడం వెనుక అసలు కథేంటి?

వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

పళ్ల ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు పెరుగుతుందా? 1.90 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో ఏం తేలిదంటే!

ఈ 5 విషయాలు గమనిస్తే చాలు.. ఎదుటివారి అసలు వ్యక్తిత్వం ఇట్టే తెలిసిపోతుంది!

ఆఫీస్ వేర్‌లో క్లాసీగా కనిపించాలంటే.. ఈ 5 వార్డ్‌రోబ్ ఎసెన్షియల్స్ మీ దగ్గర ఉండాల్సిందే!

Big Stories

Advertisement
×