E-Paper
Advertisement

పళ్ల ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు పెరుగుతుందా? 1.90 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో ఏం తేలిదంటే!

పళ్ల ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు పెరుగుతుందా? 1.90 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో ఏం తేలిదంటే!
Advertisement

Dental Care Tips: మన పళ్లు కేవలం ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాదు.. మన మొత్తం ఆరోగ్యానికి కూడా కీలకమే. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ దంతాల పరిస్థితి మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు 75 ఏళ్లు పైబడిన సుమారు 1.90 లక్షల మంది వృద్ధుల ఆరోగ్య, దంత రికార్డులను పరిశీలించి పళ్ల పరిస్థితి, చికిత్స పొందిన దంతాలు, మరణాల మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేశారు.

ఈ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు.. మన దంతాల ఆరోగ్యాన్ని ఇకపై నిర్లక్ష్యం చేయకూడదని గుర్తుచేస్తున్నాయి. అసలు పళ్ల ఆరోగ్యానికి, మన ఆయుష్షుకు ఉన్న సంబంధం ఏంటి? ఏ దంత సమస్యలు ప్రమాద సంకేతాలుగా కనిపించాయి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఊడిపోయిన పళ్లు హెచ్చరిస్తాయి:

Advertisement

నోట్లో ఎన్ని పళ్లు ఉన్నాయనే దానికన్నా, ఉన్న పళ్లు ఎంత బలంగా ఉన్నాయనేదే ముఖ్యం. ఊడిపోయిన లేదా పుచ్చిపోయిన పళ్లు ఎక్కువగా ఉంటే ఆయుష్షు తగ్గే ప్రమాదం ఉందని అధ్యయనం చెప్తోంది. పళ్లు సరిగ్గా లేకపోతే నమలడం కష్టమై, శరీరానికి కావలసిన పోషకాలు అందవు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Also Read: ఈ 5 విషయాలు గమనిస్తే చాలు.. ఎదుటివారి అసలు వ్యక్తిత్వం ఇట్టే తెలిసిపోతుంది!

ఫిల్లింగ్ చేయించినా పర్లేదు:

Advertisement

పన్ను పుచ్చిపోతే తీయించుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. కానీ డెంటిస్ట్‌ను కలిసి ఫిల్లింగ్ చేయించుకుంటే, అది కూడా సహజమైన పన్నులాగే పనిచేస్తుంది. డాక్టర్ వద్ద క్లీన్ చేయించుకుని ఫిల్లింగ్ చేసుకున్న పళ్లు ఉన్నవారు కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయని ఈ పరిశోధనలో తేలింది.

శరీరానికి పాకే ఇన్‌ఫ్లమేషన్:

పళ్లు పుచ్చిపోయినా, చిగుళ్ల సమస్యలు ఉన్నా అక్కడ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే నోటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.

సమయానికి చికిత్స ముఖ్యం:

పళ్ల సమస్య రాగానే ఆలస్యం చేయకుండా డెంటిస్ట్‌ను కలవడం చాలా అవసరం. సరైన సమయంలో చికిత్స చేయించుకోవడం వల్ల పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం, క్రమం తప్పకుండా డెంటల్ చెకప్ చేయించుకోవడం అలవాటు చేసుకుంటే ఆయుష్షుతో పాటు ఆరోగ్యమూ మన సొంతమవుతుంది.

Also Read: ఆఫీస్ వేర్‌లో క్లాసీగా కనిపించాలంటే.. ఈ 5 వార్డ్‌రోబ్ ఎసెన్షియల్స్ మీ దగ్గర ఉండాల్సిందే!

Tags

Related News

ఈ 5 విషయాలు గమనిస్తే చాలు.. ఎదుటివారి అసలు వ్యక్తిత్వం ఇట్టే తెలిసిపోతుంది!

ఆఫీస్ వేర్‌లో క్లాసీగా కనిపించాలంటే.. ఈ 5 వార్డ్‌రోబ్ ఎసెన్షియల్స్ మీ దగ్గర ఉండాల్సిందే!

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే అస్సలు తినలేరు!

స్వీట్స్ తినడం కంటే ఇది డేంజర్.. షుగర్ సమస్య పెరగడానికి అతిపెద్ద కారణం ఇదే

చేతిలో క్యాష్ ఉందా?.. కాస్త జాగ్రత్త.. వేణుస్వామి షాకింగ్ వార్నింగ్!

మంగళవారం, శనివారం ఈ ఆహారాలు తినకూడదని ఎందుకు అంటారు? కారణం తెలుసా?

భోజనం చేసిన వెంటనే పొట్ట ఉబ్బుతుందా? ఈ 4 తప్పుడు అలవాట్లే కారణం

Big Stories

Advertisement
×