BigTV English

how to good life: నీ కోసం నువ్వు బతకడం ఎలా ?

how to good life: నీ కోసం నువ్వు బతకడం ఎలా ?

how to good life: ప్రస్తుత సమాజంలో అందరూ మంచి కన్నా చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి చెప్పిన వారిని దూరం చేసుకుంటున్నారు, చెడు చెప్పిన వారి మాటలు వింటున్నారు. దీని వల్ల నష్టపోయేది వారే అన్న విషయం వారికి కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. కాని ఎప్పటికి మంచి గెలుస్తుందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి.


అయితే మంచి అలవాట్లను జీవితకాలం కొనసాగించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చెడ్డ అలవాట్లను మానుకోవాలన్న అంతే కష్టంగా ఉంటుంది. చెడుకు వదలకుండా కొనసాగించే పవర్ ఉంటుంది. మంచి వాటిని ఎప్పుడు వదిలెద్దమా అన్నట్లుగా మన బలహీనతలు అడ్డుపడుతుంటాయి. మంచి చెడుకి మధ్య ఘర్షణ ప్రతి ఒక్క మనిషికి మనస్సులో ఈ సంఘర్శన జరుగుతుంటుంది. కొంత మంది మంచి ఆలోచనలు చేస్తారు, మంచి ఆచరణలు పెడుతుంటారు.. వీటినే కొనసాగిస్తూ ముందుకు వెళతారు కాబట్టి వారు అన్నింట్లో విజయాన్ని సాధిస్తారు. ఇలాంటి వారిపైన చెడు ప్రభావం ఎక్కువగా ఉన్న వీరు దాన్ని పాటించకుండా మంచి వైపే నడుస్తే వీరి జీవితం హాయిగా ఉంటుంది.

బతుకు సూత్రం


బ్రతకడం కోసం ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ రాజీ పడుతూ,
గొడవ ఎందుకులే మనశ్శాంతిగా ఉందామని నిరంతరం ఆయాసపడుతూ,
వదులుకోవడం నచ్చక దారుణమైన మనుషుల్ని కూడా నిరంతరం భరిస్తూ,
వాళ్ళు నీతో ఎలా ఉన్నా , నీవైపు నుంచి మాత్రమే మంచి సంబంధాలను కొనసాగిస్తూ, సాటివాళ్ళ ఆనందం కోసం రోజూ నీకు నచ్చిన చాలా వాటిని వదిలేసుకుంటూ….బ్రతికేస్తున్నావ్ కదా ఏదోలా ! ఇలాంటి జీవితాన్ని చాలా మంది ఫేస్ చేస్తున్నారు.

నీ కోసం నువ్వు బతకడం

చాలా మంది వారి కోసం బతకడం మానేస్తుంటారు. కాని అవన్నీ మానేసి వారికి నచ్చినట్లుగా బతకడం నేర్చుకోవాలి. ఎవరికోసమే బతకడం కాకుండా వారికి ఏమి ఇష్టమూ, వారు జీవితంలో ఏమి కోల్పోతున్నారు అనేది నేర్చుకోవాలి. మీరు కొన్ని కారణాల వల్ల మీకు నచ్చినట్లుగా ఉండలేకపోతారు. మీకు నచ్చని జీవితాన్ని పొందలేకపోతారు. కానీ వాటిలో కన్వీన్స్ అయ్యి బ్రతకారంటే జీవితంలో మళ్లీ ఎప్పటికి పొందలేకపోతారు. కావున మీకు ఏం కావాలన్నా.. మీరు ఒకరి గురించి ఆలోచించకుండా మీకు నచ్చినట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి.

Also Read: రాసిపెట్టుకోండి.. ఇది తాగితే హార్ట్ ఎటాక్ రాదు..

ముఖ్యంగా ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నమనేది ముఖ్యం కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం.. సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది. జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బతకాలి. ఇక్కడ బతకాలి అంటే, యుద్ధం చేయాలి, పోరాడాలి. అంతేకాకుండా భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరం విసిరి వేస్తుంది. కావున నీ జీవితం నీది.. నీకు నచ్చినట్లుగా నువు బ్రతకడం నేర్చుకో.. ఎట్టిపరిస్థితుల్లో ఒకరి కోసం నువ్వు బతకకూడదు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×