Heart Health: ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది చిన్న వయస్సులోనే గుండె సమస్యలతో మరణిస్తున్నారు. ప్రతి నలుగురు మరణాలలో ఒకరు గుండె సమస్యతో మరణించిన వారు ఉంటున్నారు. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల గుండె సమస్యను నివారించవచ్చు.
అయితే హార్ట్‌లో బ్లాక్స్ వచ్చి అవి కరగడానికి అలాగే.. భవిష్యత్తులో హార్ట్‌లో బ్లాక్స్ రాకుండా ఉండటానికి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తొందరగా తగ్గడానికి, అధిక బరువు తగ్గాడానికి.. అసలు గుండె సులువుగా బాగా పనిచేయడానికి బెస్ట్ డైట్ ప్లాన్ ఎంటో తెలుసా?
దీంతో గుండె సమస్యలకు చెక్..
గుండె సమస్యలు ఉన్నవారు రోజు మునగాకు పొడి తీసుకుని దానిని మరిగించి కషాయంలాగా చేసుకుని వడకట్టి పిప్పి తీసి దానిని గ్లాసు తీసుకుని అందులో తేనె కలుపుకుని త్రాగాలి. దీనిని తాగడం వల్ల 86 శాతం హార్ట్‌లో బ్లాక్స్ రావని సైంటిఫిక్ ద్వారా నిరూపించబడింది. ఈ కషాయాన్ని రోజూ ఉదయం తాగాలని చెబుతున్నారు. ఇది తాగితే మంచి ఆకలి కూడా వేస్తుందని చెబుతున్నారు. ఈ కషాయం తాగిన తర్వాత ఏది పడితే అది తినకూడదంటున్నారు. కషాయం తాగిన ఒక అరగంటకు వెజిటెబుల్ జ్యూస్ తాగాలి. ఇలా తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ను పెంచతాయి. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
డైలీ డైట్
అధిక బరువు ఉన్నవారు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతున్నారు. అయితే ఉడికించిన ఆహారం కాకుండా మొలకలు.. ముఖ్యంగా మొలకలు అంటే కొందరు వెరుశనగలు, పెసర గింజలు, బాదం అనుకుంటారు.. కానీ వాటితో పాటు గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, పుచ్చకాయ గింజల పప్పులను కూడా నానబెట్టుకోవచ్చు. అలాగే వాల్ నట్స్, బాదం పప్పులను సరిపడా తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో పాటుగా అంజీరా, ఖర్జూర, కిస్‌మిస్, కొన్ని ఫ్రూట్స్ ముక్కలు తీసుకోవాలి. ఇలా ఉదయం, సాయంత్రం న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని వల్ల హార్ట్ మజిల్‌కి, బీపీకి చాలా మంచిది. ఇది హైపోటాషియం డైట్ కాబట్టి బీపీ కంట్రోల్‌కి వస్తుంది, రక్తనాళాలు మంచిగా పనిచేస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి ది బెస్ట్ డైట్ అంటున్నారు వైద్యులు. ఈ డైట్ అనేది మీరు వారానికి రెండు లేదా మూడు రోజులు తింటే చాలా మీ ఆరోగ్యం మొత్తం బాగుంటుంది.
వ్యాయామం తప్పనిసరి
కదలకుండా పని చేసేవారికి గుండె పోటు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇలా కదలకుండా చేసే పనులే చేస్తున్నారు. దీంతో గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది, హార్మోన్స్‌ను సరైన మోతాదులో పొందడానికి యోగా తప్పనిసరిగా చేయాలని పలు వైద్యులు చెబుతున్నారు.
Also Read: డ్రాగన్ ఫ్రూట్ తినకపోతే.. ఈ బెనిఫిట్స్ మిస్సవుతారు !
ఒత్తిడిని నివారించడం
ప్రస్తుతం చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ఆఫిస్తులో స్ట్రెస్, ఇంట్లో పరిస్థితులు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వంటి వాటి వల్ల చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒత్తిడి తగ్గించుకుంటే గుండె భారం తగ్గుతుంది. దానికి మ్యూజిక్ వినడం, గేమ్స్ ఆడటం, స్నేహితులతో గడపడం వంటివి చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రకృతి ఒడిలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి.
నిద్ర, మంచి ఆహారం
దీర్ఘకాలంలో నిద్ర సమస్య వల్ల గుండె పోటు సమస్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చాలా మంది ఎప్పుడో అర్థరాత్రి పడుకుంటున్నారు. అలా కాకుండా మంచి నిద్ర వల్ల మీకు అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న ప్రజలు అందరు బయటి ఫుడ్‌కి అలవాటు పడ్డారు.. దీంతో గుండె సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించడం మేలు..