Tan Removal Tips: టానింగ్ అనేది ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య. టానింగ్‌కు ప్రధాన కారణం సూర్యుని హానికరమైన కిరణాలు. అందుకే వేసవి కాలంలో.. చాలా మంది చర్మాన్ని రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చర్మంపై టానింగ్ సమస్య పెరుగుతుంది.
ఈ కారణంగానే.. చాలా సార్లు మహిళలు స్లీవ్‌లెస్ దుస్తులు ధరించడానికి కూడా సిగ్గుపడతారు. మీరు కూడా టానింగ్ వల్ల ఇబ్బంది పడే వారిలో ఒకరైతే.. ఇంట్లో కూర్చొని టానింగ్ తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ, కలబంద:
మీరు ట్యానింగ్ ఈజీగా తొలగించాలనుకుంటే.. నిమ్మకాయ, కలబందలను ఉపయోగించడం మంచిది. కలబంద జెల్ , నిమ్మకాయ మిశ్రమం చర్మంపై మ్యాజిక్ లాగా పనిచేస్తుందని చెబుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో.. ఇది చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. ముఖంపై జిడ్డును తొలగించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది.
మీరు పై రెండింటినీ కలిపి పేస్ట్ చేయాలనుకుంటే.. మీకు తాజా కలబంద జెల్, నిమ్మరసం, బ్రష్ అవసరం అవుతాయి. నిమ్మకాయలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. కలబంద కూడా చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా పోషణను అందిస్తుంది.
ముఖం నుండి చేతులు, కాళ్ళ వరకు ఎక్కడ టానింగ్ ఉందో.. ముందుగా ఆ చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయండి. దీని కోసం మీరు మంచి క్లెన్సర్‌ని ఉపయోగించవచ్చు. చర్మం శుభ్రమైన తర్వాత.. బ్రష్ సహాయంతో పేస్ట్‌ను పూర్తిగా అప్లై చేయండి.
Also Read: ఉదయం పూట ఖాళీ కడుపుతో ఫ్రూట్ సలాడ్ తింటే.. ?
ఇప్పుడు ఈ పేస్ట్ ని కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచండి. 20 నిమిషాల తర్వాత.. చర్మాన్ని గోరు వెచ్చని నీటితో కడగాలి. మీ చర్మంపై ఉన్న టానింగ్ పూర్తిగా తొలగిపోవడానికి మీరు వారానికి మూడుసార్లు ఈ రెమెడీని అనుసరించవచ్చు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి:
మీరు కలబంద, నిమ్మరసాలను ట్యానింగ్ తొలగించడానికి ఉపయోగిస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ అందరికీ సరిపోదు. కాబట్టి.. నిమ్మకాయ రాసుకున్న తర్వాత ఎండలో బయటకు వెళ్లకండి. లేకుంటే మీ చర్మంపై చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే చాలా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.