TNPL 2025: క్రికెట్ లో… చాలా రకాల సంఘటనలు జరుగుతాయి. ఇందులో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతే… మరికొన్ని భయంకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి. అయితే మరికొన్ని సంఘటనలు అందరినీ నవ్విస్తాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మరో సంఘటన జరిగింది. రన్ అవుట్ చేయబోయి… దారుణంగా విఫలమయ్యారు దిండిగల్ డ్రాగన్స్. మూడుసార్లు త్రో చేయబోయి… మూడుసార్లు కూడా విఫలమయ్యారు. ఈ ఆసక్తికర సంఘటన దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ సీచెమ్ మధురై పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగింది.
Also Read: SA Won WTC Final: బవుమా చేతిలో ఆసీస్ చిత్తు.. WTC ఛాంపియన్ గా సౌతాఫ్రికా..27 ఏళ్ళ తర్వాత
మూడుసార్లు త్రో మిస్.. ఇదెక్కడి ఫీల్డింగ్ రా
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా దిండిగల్ డ్రాగన్స్ ఆటగాళ్ళు వర్సెస్ సీచెమ్ మధురై పాంథర్స్ ( Dindigul Dragons players VS Saichem Madurai Panthers ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కంటే అత్యంత దారుణమైన ఫీల్డింగ్ చేసింది దిండిగల్ డ్రాగన్స్ టీం. ఒక ప్లేయర్ కూడా సరిగ్గా ఫీల్డింగ్ చేయలేకపోయాడు. ఆ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా త్రో మిస్సై… దారుణమైన ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇక కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బాటలోనే.. ఫీల్డర్స్ కూడా అలాగే ప్రవర్తించారు. దీంతో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
సీచెమ్ మధురై పాంథర్స్ జట్టుకు సంబంధించిన ఓ బ్యాటర్ ఆఫ్ సైడ్ దిశగా.. భారీ షాట్ ఆడాడు. అయితే ఆఫ్ సైడ్ లో ముందుగా ఉన్న అశ్విన్ చేతిలో ఆ బంతి పడింది. పరుగు తీస్తున్న బ్యాటర్ ను అవుట్ చేసేందుకు… రవిచంద్రన్ అశ్విన్ త్రో విసిరాడు. డైరెక్ట్ త్రో కొట్టబోయి విఫలమయ్యాడు అశ్విన్. ఇక వికెట్ల వెనుక ఉన్న మరో ఫీల్డర్ ఆ బంతిని తీసుకొని…. కీపర్ వైపు కొట్టే ప్రయత్నం చేశాడు. అనంతరం మరో ఫీల్డర్ కూడా రన్ అవుట్ చేయబోయి విఫలమయ్యారు. ఇలా ముగ్గురు ఫీల్డర్లు మూడుసార్లు కొట్టి… దారుణంగా విఫలమయ్యారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు తమ స్టైల్ లో స్పందిస్తున్నారు.
పాకిస్తాన్ కంటే చెత్త ఫీలింగ్
అశ్విన్ సారథ్యం వహిస్తున్న దిండిగల్ డ్రాగన్స్ జట్టు అత్యంత దారుణంగా విఫలమైందని సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ల కంటే అత్యంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తున్నారని కూడా… సెటైర్లు పేల్చుతున్నారు. ముగ్గురు త్రో కొడితే ఒక్కరికి…. కూడా త్రో తగలలేదని… చురకలాంటిస్తున్నారు. మొన్న రవిచంద్రన్ అశ్విన్… అంపైర్ పై రెచ్చిపోయాడు కదా…? ఇప్పుడు ఫీల్డింగ్ చేయడం చేత కావడం లేదా ? అంటూ మండిపడుతున్నారు.
Also Read: Anushka Shetty: టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి.. తనకంటే తక్కువ వయసు ప్లేయర్ తోనే ?
THIS IS PEAK TNPL MOMENT 😂👌 pic.twitter.com/8eVuUZgS06
— Johns. (@CricCrazyJohns) June 14, 2025