Coriander Leaves: ఏ వంటకం తయారీలో అయినా దాదాపు అందులో పచ్చి కొత్తిమీరను ఉపయోగిస్తారు. పచ్చి కొత్తిమీర ఆహారం రుచిని పెంచడమే కాకుండా శరీరానికి పూర్తి పోషణను అందిస్తుంది. అంతే కాకుండా పచ్చి కొత్తిమీర వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
పచ్చి కొత్తిమీర తినడం వల్ల ఇందులోని పోషకాలు చర్మం యొక్క కొల్లాజెన్‌ని పెంచుతాయి. అంతే కాకుండా ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. పచ్చి కొత్తిమీర ఆకులను తినడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొత్తిమీర ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పచ్చి కొత్తిమీర జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడతాయి. అంతే కాకుండా గ్యాస్, అజీర్ణం, వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు తరుచుగా పచ్చి కొత్తి మీరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఆహారం త్వరగా జీర్ణం అవడానికి ఇందులోని పోషకాలు ఉపయోగపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
చర్మానికి మేలు చేస్తుంది: పచ్చి కొత్తిమీరలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: కొత్తిమీరలో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల, ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. తరుచుగా డయాబెటిస్ పేషేంట్లు కొత్తిమీరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొత్తి బమీర జ్యూస్ తాగినా కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
కళ్లకు మేలు చేస్తుంది: పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కంటిశుక్లం వంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
Also Read: ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు పెరగడం పక్కా !
ఇతర ప్రయోజనాలు:
ఎముకలను బలపరుస్తుంది: పచ్చి కొత్తిమీర కాల్షియం యొక్క మంచి మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
గుండెకు మంచిది: కొత్తిమీర రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
క్యాన్సర్ రక్షణ: కొత్తిమీరలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.