నీరు మనుషులకే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఆధారం. నీరు ప్రతి గంటకు తాగాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని హైడ్రేషన్ కు గురిచేసి ఆరోగ్యంగా ఉండేలా చూడడంలో నీరు ముందుంటుంది. అలాగే ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగాల్సిన అవసరం ఉందని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే చాలామంది నీళ్లు తాగేందుకు ఇష్టపడరు. కేవలం దాహం వేసినప్పుడు కొంచెం నీళ్లు తాగి ఊరుకుంటారు. దీనివల్ల శరీరం అనేక వ్యాధుల బారిన పడుతూ ఉంటుంది.
నీళ్లు తాగడం ముఖ్యమే. అయితే సరైన పద్ధతుల్లో తాగడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు. ఇంట్లోని పెద్దలు నీళ్లు తాగడం మంచి పద్ధతి కాదని కూర్చుని నీళ్లు తాగమని వివరిస్తూ ఉంటారు. ఇలా నిల్చుని నీళ్లు ఎందుకు తాగకూడదు? నిలబడి నీరు తాగడం శరీరానికి ఎలా హానికరం? తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
ఇస్లామిక్ విశ్వాసాలలో కూడా నిలబడి నీళ్లు తాగకూడదని చెబుతారు. ఒక కథనంలో ప్రవక్త మహమ్మద్ ప్రజలు నిలబడి నీరు తాగవద్దని చెప్పినట్టు ఉంది. నిలబడి నీరు తాగడం హరామ్ అని అంటారు. ఇస్లాం ప్రకారం మీరు నీరు లేదా ఏదైనా పానీయం నిలబడి తాగకూడదు. హాయిగా కూర్చునే తాగాలి. అలాగే నీటిని తాగేటప్పుడు కుడి చేతితోనే ఆ గ్లాసును పట్టుకొని తాగాలని ఇస్లాంలో ఉంది.
ఇక సైన్స్ విషయానికి వస్తే నిలబడి నీళ్లు తాగడం మంచిది పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. నిలబడి నీరు తాగితే దాహం పూర్తిగా తీరదు. అలాగే శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్స్ కూడా బయటకు రాలేవని అంటారు. నీటిలో ఉండే పోషకాలు, విటమిన్లు శరీరంలోని అన్ని భాగాలకు చేరవని అంటారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోకి నీరు చాలా వేగంగా చేరుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం అధికంగా పడుతుందని చెబుతారు.