Leftover Rice: రాత్రి వేళల్లో మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే, ఈ అలవాటు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రాత్రి మొత్తం ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు రాత్రి మిగిలిన అన్నం ఫ్రిడ్జ్‌లో పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అన్నం వండేటప్పుడు అందులో చాలా నీళ్లు పోస్తారు. ఈ నీళ్లు పాడయ్యే సమయంలో బాక్టీరియాలు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టినపుడు కూడా, బాక్టీరియాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది గాస్ట్రోఇంటెస్తినల్ ఇన్‌ఫెక్షన్లు, కడుపు సమస్యలు, డయారియా, అసాధారణ జ్వరం లాంటి అనారోగ్యాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
అన్నంలో ఉండే రిచ్ కార్బోహైడ్రేట్లు పాడవుతున్న కొద్దీ ఆహారం విషపూరితంగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్‌లో ఉంచినప్పటికీ అన్నంలోని పోషకాలు అలాగే ఉండవు. దీంతో రాత్రి మొత్తం ఫ్రిడ్జ్‌లో ఉంచిన ఆహారంలో పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందట.
ALSO READ: గుండు చేసుకుంటే జుట్టు రాలే సమస్య తీరుతుందా?
కొన్ని సమయాల్లో, రాత్రి మిగిలిన అన్నంలో గ్లూటెన్ ఏర్పడుతుంది. దీని వల్ల కొందరిలో అలర్జీ వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన అన్నం తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు.
సమస్య తగ్గాలంటే ఏం చేయాలి?
మనం ప్రతిరోజూ అన్నం తినడానికి అవసరమైనంత మాత్రమే వండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే రాత్రి మిగిలిన అన్నం వాడే అవసరం ఉండదు.
ఒకవేళ మిగిలిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సి వస్తే పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా పెరగకుండా ఉంటుందని అంటున్నారు. ఎక్కువసార్లు మళ్లీ వేడి చేయడం, ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హానికరం అవుతుంది.
ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇతర ఆహార పదార్థాలలో ఉండే సమ్మేళనాల వల్ల అన్నంలో ఎలాంటి బాక్టీరియా పెరగకుండా ఉండాలంటే సరిగా ప్యాక్ చేసి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.