Sri Reddy: సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు శ్రీరెడ్డి. గతంలో ఈమె, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, పై అసభ్యకరమైన పోస్టులను పెట్టారు. అందుకుగాను ఈమె పై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఈమె విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకరమైన పోస్టులు చేసిందన్న కేసులో ఈమెను ఈరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించారు.
నోటీసులు అందుకున్న నటి ..
గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో శ్రీరెడ్డి తనకి ఇష్టం వచ్చినట్లుగా.. అప్పటి ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వారిని తిట్టిన సంగతి తెలిసిందే.. అందుకుగాను శ్రీ రెడ్డిపై కేసు నమోదు అయింది. 41 ఏ కింద పోలీసులు ఈమెకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరైన శ్రీ రెడ్డి వారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు.
శ్రీ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో టీడీపి, జనసేన నాయకులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం ఈమె మీద ఆరు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం, శ్రీ రెడ్డి కోర్టులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో విచారణకు హాజరైన శ్రీరెడ్డి
విజయనగరం జిల్లా పూసపాటిరేగ PS లో విచారణకు హాజరైన శ్రీరెడ్డి
41A నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించిన పోలీసులు
అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపిన పోలీసులు pic.twitter.com/otxWCb6cHx
— BIG TV Breaking News (@bigtvtelugu) April 19, 2025