E-Paper
Advertisement

వానాకాలంలో.. జామకాయ తింటే నిజంగా జలుబు చేస్తుందా ?

వానాకాలంలో.. జామకాయ తింటే నిజంగా జలుబు చేస్తుందా ?
Advertisement

Guava Benefits in monsoon: వర్షాకాలం రాగానే మార్కెట్లో ఎక్కడ చూసినా పచ్చని, దోర జామకాయలు దర్శనమిస్తాయి. వాటిని ముక్కలు చేసి కొంచెం ఉప్పు, కారం చల్లుకుని తింటుంటే ఆ టేస్టే వేరు కదా! అయితే చాలామందికి వానాకాలంలో జామకాయ తింటే జలుబు, దగ్గు వస్తుందనే ఒక అపోహ ఉంది. కానీ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఈ సీజన్‌లో దొరికే జామకాయ మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందట. మరి ఈ వానాకాలంలో జామకాయను ఎందుకు అస్సలు మిస్ అవ్వకూడదో, దానివల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

“రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు” అంటారు. కానీ సైన్స్ ప్రకారం, యాపిల్ కంటే తక్కువ ధరలో దొరికే జామకాయలోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణం మారడం వల్ల మన బాడీలో మెటబాలిజం, ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి. ఈ టైంలో జామకాయను డైట్‌లో చేర్చుకుంటే.. శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు అందుతాయి.

జామకాయ తినడం వల్ల కలిగే ఆ 5 ప్రధాన ప్రయోజనాలు:

Advertisement

1.ఇమ్యూనిటీ పెరుగుతుంది :
జామకాయలో మనకు తెలిసిన అన్ని పండ్ల కంటే అత్యధికంగా విటమిన్-సి ఉంటుంది. ఇది నారింజ పండు కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ! వర్షాకాలంలో గాల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ టైంలో రోజుకో జామకాయ తింటే అందులోని విటమిన్-సి బాడీ ఇమ్యూనిటీని పెంచి, జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

2. జీర్ణక్రియ సూపర్ ఫాస్ట్:
వానాకాలంలో పొట్ట ఖరాబ్ అవ్వడం, మలబద్ధకం వంటి సమస్యలు చాలా కామన్. జామకాయలో డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువ. ఇది మీ జీర్ణవ్యవస్థను క్లీన్ చేసి, పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. రోజువారీ ఫైబర్ అవసరాల్లో ఒక జామకాయే 12% వరకు అందిస్తుంది.

Advertisement

3. డయాబెటిస్ కంట్రోల్ :
జామకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇది తిన్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్‌స్టంట్‌గా పెరిగిపోవు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ పండును హ్యాపీగా తినొచ్చు.

4. గుండె ఆరోగ్యం:
జామకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం బాడీలోని సోడియం లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఇది బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి జామకాయ బాగా హెల్ప్ అవుతుంది.

5. వెయిట్ లాస్ :
వర్షాకాలంలో వర్షాల వల్ల బయటకు వెళ్లి వర్కవుట్స్ చేయడం కుదరదు. పైగా వేడివేడిగా జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో జామకాయ తింటే అందులోని ఫైబర్ వల్ల కడుపు నిండినట్లు ఉండి, అనవసరమైన క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ, పోషకాలు చాలా ఎక్కువ.

వర్షాకాలంలో జామకాయ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

జామకాయ మంచిదే అయినప్పటికీ, వానాకాలంలో కొన్ని చిన్న జాగ్రత్తలు ముఖ్యం.

జామకాయను తినే ముందు ఉప్పు నీటితో బాగా కడగాలి, ఎందుకంటే ఈ సీజన్‌లో పండ్లపై బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది.

పంటి సమస్యలు ఉన్నవారు జామకాయ గింజలను గట్టిగా నమలకూడదు.

మరీ రాత్రి పూట కాకుండా ఉదయం లేదా సాయంత్రం స్నాక్ టైంలో తింటే జలుబు చేసే ఛాన్స్ అస్సలు ఉండదు.

Tags

Related News

ప్రేమ, మోసం, బ్రేకప్ ప్లాన్.. అన్నింటికీ జెన్‌ జీ రెడీ, మాడ్రన్ డేటింగ్‌లో ఈ పదాలు తెలుసా

మీ సోదరికి రాఖీ గిఫ్ట్ ఏం ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? రూ.500లోపు బెస్ట్ ఐటెమ్స్ ఇవే

తప్పు చేసినా అంగీకరించరు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈగో, మొండితనం ఎక్కువ

రాఖీ రోజు ఏ తప్పులు జరగకుండా ఈ చెక్ లిస్ట్ రెడీ చేయండి..

రాఖీ పండుగకు బాలీవుడ్ టచ్.. అమ్మాయిలకు స్టైలిష్ డ్రెస్‌లు

దగ్గు, జలుబు మందులపై ఆంక్షలు విధించిన కేంద్రం.. పిల్లలకు కఫ్ సిరప్ ఇచ్చే ముందు ఇది తెలుసుకోవాలి

వర్షాకాలంలో నోటి దుర్వాసన, చిగుళ్లలో సమస్యలు తీవ్రం.. ఈ జాగ్రత్తలు పాటించండి

రాఖీ పండుగ రోజు ఇల్లు అందంగా అలంకరించాలా? తక్కువ ఖర్చుతో డెకరేషన్ టిప్స్ మీ కోసం

Big Stories

Advertisement
×