BigTV English

Causes of Itching: దురద ఎందుకొస్తోంది..? గోకితే ఎందుకు పోతోంది..?

Causes of Itching: దురద ఎందుకొస్తోంది..? గోకితే ఎందుకు పోతోంది..?
Itching Causes
Itching Causes

Itching Causes: మనలో ప్రతీ ఒక్కరికీ ఏదోక సమయంలో దురదలు వస్తుంటాయి. ఈ దురదలు కొందరికి చేతులపై వస్తే మరికొందరికి తలపై లేదా వీపుపై వస్తుంటాయి. ఇలా శరీరంలోని ప్రతి భాగంపై దురదలు రావడం సహజం. దురదలను ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోరు. గోక్కుంటే పోయే దురదపై ఖర్చు చేయడం ఎందుకని భావిస్తారు. అయితే ఈ దురద ఎందుకొస్తోంది? గోకితే ఎందుకు పోతోందన్న దాని గురించి తెలుసుకుందాం.


దురదలు దీర్ఘకాలికంగా ఎందుకు వస్తాయనేది శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. అయితే తీవ్రమైన దురద ఎందుకొస్తుందనేది దాని గురించి మాత్రం తెలియజేశారు. మీరు దోమకాటుకు గురైనా లేదా దురదగుంటాకు లాంటివి మీ శరీరానికి తగిలినా, శరీరంపై క్రిములు చేరిన దురదలు వస్తాయి. ఇందుకు కారణం శరీరంలోని రోగనిరోధక కణాలు హిస్టామైన్, ఇతర కారకాలను విడుదల చేయడమే. ఇవి ఇంద్రియ నాడులపై ఉన్న సూక్ష్మగ్రాహికల ద్వారా స్పందించి దురద అనే భావనను వెన్నెముక ద్వారా మెదడుకు చేరవేస్తాయి.

2007లో వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్‌ శాస్త్రవేత్తలు శరీరంలో ప్రత్యేకంగా దురదను కలిగించే గ్రాహకాలను కనుగొన్నారు. ఇవి వెన్నెముకలోని నరాలకు సంబంధించిన ఉపసముదాయంపై ఆధారపడి ఉంటుందని తేల్చారు. ఎలుకలలో ఇటువంటి వ్యవస్థ లేదు కాబట్టి వాటిని దురద వేయదు. వాటిని ఎంత చికాకు కలిగించినా, చక్కిలిగింతలు పెట్టినా స్పందించవు. కానీ అవి నొప్పిని అనుభవిస్తాయి.


Also Read: వాసన భరించలేకపోయినా.. చెమట మంచిదే!

వెన్నెముకలో నరాలు దురద అనుభూతిని మెదడుకు ప్రత్యేకంగా చేరవేస్తాయి. ఇంద్రియ నాడుల ద్వారా చర్మం ఉత్తేజితమయ్యేచోట దురదగ్రాహకాలు ఏర్పడతాయి. ఇవి దురదకు సంబంధిత సంకేతాలను నేరుగా మెదడుకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా చర్మంలో ఏర్పడిన వాపునకు ఐఎల్-4 ఐఎల్-13 అని పిలిచే రోగనిరోధక కణాలు.. దురదకు సంబంధించిన రసయనాలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలను సైటోకైన్స్ గా పిలుస్తారు.

ఐఎల్ -31 దురదను కలిగించడంతో పాటు మంటను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల దురద అనుభూతి అంతిమంగా తగ్గిపోతుంది. ఇందులో భాగంగా ఐఎల్-31ను ఎలుకకు ఇచ్చారు. తరువాత ఆ ఎలుకను దురద , అలర్జీలు కలిగించే సూక్ష్మక్రిములు ఉన్న ప్రాంతలో విడిచిపెట్టారు. ఆ ఎలుకకు ఎటువంటి దురదగానీ, అలర్జీగానీ కలగలేదు.

Also Read: చేపకళ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

అయితే ఈ దురదను తక్కువ అంచనా వెయ్యకూడదంటున్నారు పరిశోధకులు. కొన్ని సందర్భాల్లో ఓ పెద్ద వ్యాధి సోకబోతోందనే సంకేతాలు కూడా దురద ఇస్తుందట. దురద వచ్చినప్పుడు చేతులతో గోక్కోగానే ఆ విషయం బ్రెయిన్‌లోని న్యూరాన్లకు చేరుతుంది. తద్వారా కండరాలు సాంత్వన లభించినట్లు భావిస్తాయి. దీనివల్ల దురద ఆగిపోతుంది. దీనికి సంబంధించిన వివరాలు మెకానికల్ బిహేవియర్ ఆఫ్ బయోమెడికల్ మెటీరియల్స్ అనే జర్నల్‌లో భద్రపరిచారు. దురద వచ్చినప్పుడు గోకడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న క్రిముల చెల్లా చెదురై వెళ్లిపోతాయి. అందువల్ల దురద వచ్చినప్పుడు కచ్చితంగా గోక్కోవాలి. లేదంటే అది పెద్ద ప్రమాదనికి కారణం కావచ్చు.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల,మెడికల్ జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Related News

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Raksha Bandhan: తల్లి కొడుకుకి రాఖీ కట్టొచ్చా? హిందూ సాంప్రదాయం ఏం చెబుతుంది?

Curd: అమ్మ బాబోయ్.. పెరుగుతో వీటిని తింటే విషంతో సమానమా..?

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?

Snoring in sleep: నిద్రలో గురక… గుండెకు గండమా?

Onions: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

Big Stories

×