Today Gold Rate: బంగారం ధరలు రోజు రోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర(Gold Rate) రూ.97 వేలనుంచి లక్ష రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. దాదాపు ఆరు నెలల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొద్ది రోజుల్లోనే ఆ మార్క్ దాటనుంది.
అమెరికా- చైనా మధ్య ప్రతీకార సుంకాల ప్రకటనలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. మధ్యలో కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ ఎగబాకింది. ఎక్కడా తగ్గడం లేదు. పాత రికార్డులను బద్దలు గొడుతూ జెట్ స్పీడ్‌గా దూసుకుపోతోంది. నిన్నటి పోలిస్తే పది గ్రామాల బంగారం ధర రూ.710 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97 వేల 580కు చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ 10 గ్రాముల బంగారం ధర 89 వేల 450కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి.
అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. పసిడి ధరలు తగ్గే ఛాన్స్ ఉందని ఆర్దిక నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తులం బంగారం ధర రూ. రూ.50 వేలకు తగ్గనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేకపోవడం, ఆర్ధికమాంద్యం నెమ్మదిగా కుదురుకోవడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టేలా చేస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద ట్రేడింగ్ లో ఉంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,600ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97, 730 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 ఉంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఆ రీఛార్జ్ ప్లాన్లకు గుడ్‌బై..ఇక్కడ రూ.100కే 3జీబీ డేటాతో బెస్ట్ ప్లాన్
వెండి ధరలు ఇలా(Silver Rate)..
ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,09,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,900 వద్ద కొనసాగుతోంది.