Fenugreek leaves: మెంతికూర, భారతదేశంలో పాకశాస్త్రంలో పూర్వ కాలం నుండి ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన హరిత శాకమైన మొక్క. మెంతికూర మాత్రమే కాకుండా దీని మెంతులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచుగా మెంతికూర తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే మేలు గురించి తెలుసుకుందాం.
మెంతికూరను తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్త ప్రసరణ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైబీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దీన్ని ప్రతి రోజూ తినడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
మెంతికూరలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందట. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. రోజు మెంతికూర కూర తినడం వల్ల పేగులు సక్రమంగా పనిచేస్తాయని అంటున్నారు.
మెంతికూరలో విటమిన్-A, B, Cతో పాటు ఐరన్, కాల్షియం, మగ్నీషియం, పోటాషియం వంటి మినరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాల బలం పెంచడానికి, ఎముకలు కదిలించడానికి హెల్ప్ చేస్తాయట. అలాగే, మెంతికూర ఆక్సిడెంట్లతో నిండి ఉండడం వల్ల అది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెంతికూరలో ఉన్న ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారం ఒత్తిడిని నియంత్రించడానికి కూడా హెల్ప్ చేస్తుందట. పలు పరిశోధనల ప్రకారం, మెంతికూర బరువు తగ్గించడం, ఎముకలు బలంగా ఉండడంలో సహాయపడుతుంది.
ALSO READ: సమ్మర్ కదా అని అదే పనిగా నీళ్లు తాగుతున్నారా..?
మెంతికూర చర్మానికి చాలా మంచిదట. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సరిచేయడంలో మెంతులు సహాయపడతాయట. ఇప్పటికే షుగర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తరచుగా తీసుకునే ఆహారంలో దీన్ని చేర్చుకోవడం ఉత్తమం.
మెంతికూరలో ఉన్న విటమిన్-A కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు దూరం అయిపోతాయని అంటున్నారు.
మెంతికూర కూడా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుందట. కిడ్ని సంబంధిత సమస్యలను తగ్గించేందుకు ఇది ఎంతో హెల్ప్ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో మెంతులు, మెంతి కూరను తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలకు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. ఏం చేసినా నొప్పి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అలాంటి సమయంలో మెంతికూరతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.