తమ పౌరుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని భారత్ మరోసారి తేల్చి చెప్పింది. 100కు పైగా దేశాల నుంచి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటుండగా, ఈ ఏడాది చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, జపాన్, టర్కీ నుంచి ఆహార పదార్థాల దిగుమతిని తిరస్కరించింది. ఆయా దేశాల నుంచి వస్తున్న ఆహార సరుకులు నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక విషయాలను వెల్లడించింది.
ఆయా దేశాల ఆహార పదార్థాల్లో ఉన్న లోపాలు ఇవే!
ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలలో FSSAI పలు లోపాలను గుర్తించింది. నాణ్యతా లోపాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచింది.
⦿ చైనా
మే 6న చైనా నుంచి ఢిల్లీకి వచ్చిన సుషీ నోరిలో హెవీ మెటల్ ఉన్నట్లు FSSAI గుర్తించింది. వెంటనే సదరు సరకు అంతటిని తిప్పి పంపించినట్లు వెల్లడించింది. అటు మే 31న వచ్చిన బడ్ వైజర్ బీరులో pH విలువ సూచించిన పరిమితి కంటే తక్కువగా ఉన్నందున రిజెక్ట్ చేసింది.
⦿ శ్రీలంక
మే 24న బెంగుళూరుకు వచ్చిన దాల్చిన చెక్క పొడిని FSSAI తిరస్కరించింది. నింబధనలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలు లేని కారణంగా దిగుమతి చేసుకోలేమని వెల్లడించింది. ఏప్రిల్ 22న తమిళనాకు వచ్చిన శ్రీలంక పోకలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని తిప్పిపంపించింది.
⦿ బంగ్లాదేశ్
అటు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ నుంచి పోకలు సైతం దెబ్బతి తిని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సదరు సరుకును కూడా తిరిగి వెనక్కి పంపించారు.
⦿ జపాన్
జూన్ 25న జపాన్ నుండి బెంగుళూరుకు వచ్చిన మూడు రకాల టీ బ్యాగులు భారత్ కు వచ్చాయి. అవి హెల్త్ సప్లిమెంట్స్, న్యూట్రాస్యూటికల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా దిగుమతి చేసుకోలేమని అధికారులు తేల్చి చెప్పారు.
⦿ టర్కీ
జూలై 31న టర్కీ నుంచి కోల్ కతాకు వచ్చి రెడ్ ఆపిల్స్ ను దిగుమతి చేసుకోకుండా తిరస్కరించింది. రావాల్సిన గడువులోగా రాకపోవడం వల్ల పండు నిల్వ గడువు తక్కువగా ఉందనే కారణంతో తిప్పి పంపించారు.
FSSAI క్లియరెన్స్ తర్వాతే ఆహార పదార్థాల దిగుమతి
ఇంపోర్ట్ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ నిబంధనల ప్రకార భారత్ దిగుమతి చేసుకునే అన్ని ఆహార పదార్థాలకు FSSAI క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా పదార్థాలకు పరీక్షలు నిర్వహించి ఓకే అని సర్టిఫై చేసిన తర్వాతే దిగుమతి చేసుకుంటారు. తాజాగా తీసుకొచ్చిన ఫుడ్ ఇంపోర్ట్ రిజెక్షన్ అలర్ట్ (FIRA) పోర్టల్ లో దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలతో పాటు రిజెక్ట్ చేసిన ఆహార పదార్థాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో నమోదు చేస్తున్నారు. ప్రజలతో పాటు ఆయా దేశాలకు అసలు విషయాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు.
Read Also: మూడో ప్రపంచ యుద్ధం.. బాబా వంగా, నోస్ట్రాడమస్ చెప్పింది ఇదే, మీరు సిద్ధమేనా?