Lemon Peels Benefits: నిమ్మకాయ గురించి చెప్పనక్కర్లేదు. ఆహారం, పానీయాలపై నిమ్మ రసం చల్లుకోవడానికి ఇష్టపడతారు. ఆహారాన్ని రుచికరంగా చేస్తుంది.. అద్భుతమైన రుచిని తెస్తుంది. నిమ్మకాయ ఆహారంలో రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉంటుంది. నిమ్మకాయ మాత్రమే కాదు.. దాని తొక్క చాలా సమస్యలకు అద్భుతంగా పని చేస్తుంది. నిమ్మ కాయ మాదిరి తొక్క పోషకాలు నిండి ఉంటాయి. వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. నిమ్మకాయల తొక్కలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఎ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయి.
2. యాంటీ ఆక్సిడెంట్లకు ఇందులో కొదవ లేదు. తొక్కలో ఫ్లేవనాయిడ్లు, డి-లిమోనీన్, అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేస్తుంటాయి. వృద్ధాప్య ప్రక్రియను తగ్గించేలా చేస్తాయని చెబుతున్నారు.
3. నిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియా లక్షణాలతో నిండి ఉంటాయి. వీటి కారణంగా నిమ్మ తొక్కలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, దుర్వాసన, దంత క్షయాన్ని నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ALSO READ: శరీరంపై టాటూ వేయించుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి
4. జీర్ణక్రియను మెరుగుపరచడంలో నిమ్మతొక్కలకు తిరుగులేదు. అందలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు చక్కగా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, అంతేకాదు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
5. నిమ్మ తొక్కలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్లేవనాయిడ్స్, పొటాషియం ఉంటాయి. రక్తపోటును నియంత్రించడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతుందని చెబుతుంటారు.
6. చర్మాన్ని ఆరోగ్యంగా తనవంతు పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయ మాదిరి తొక్కలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, మొటిమలను తగ్గించడానికి,చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది.
7. బరువు నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాలీ ఫెనాల్స్ కొవ్వును కరిగించడం, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
8. శరీరం నుండి విష మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. శరీరాన్ని సహజంగా నిర్విషీకరణ చేయడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
9. ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నవారికి ఇదొక ఔషధం. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్న నిమ్మ తొక్కలు శరీరంలో బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
10. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నిమ్మ తొక్కలలో డి-లిమోనీన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. క్యాన్సర్ పోరాట లక్షణాలను కలిగి ఉండవచ్చు. క్యాన్సర్ కణాల ఉత్పత్తిని నెమ్మదింపజేయడంలో ఇవి సహాయపడతాయని చెబుతున్నారు.
సూచన- ఆరోగ్య నిపుణలు, సేకరించిన సమాచారం ఆధారంగా ఇక్కడ ఇస్తున్నారు. దీనికి తమ సైట్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి గమనించగలరు.