BigTV English

Metabolic Syndrome : మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఎంటో తెలుసా..?

Metabolic Syndrome : మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఎంటో తెలుసా..?

Metabolic Syndrome : మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక జీవనశైలి వ్యాధి. జీవక్రియలలో ఏర్పడే మార్పులు, ఇబ్బందులు వల్ల ఈ వ్యాధి బారిన పడతారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను పెంచుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలు కూడా రావచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం మీరు మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించాలనుకుంటే మీరు మీ జీవనశైలిని మెరుగుపరచుకోవాలి. దీన్ని సరైన సమయంలో గుర్తించడం వల్ల ఈ వ్యాధి ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారించడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.


రెగ్యులర్ వ్యాయామం ద్వారా జీవక్రియ, మొత్తం ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. అలానే ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు దీన్ని ఫాలో అవకుంటే కనీసం నడవండి లేదా మెట్లు ఎక్కే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఇంట్లో చిన్నచిన్న పనులు చేయడం ద్వారా కూడా మీ జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Also Read : ఈ ఐదు స్టెప్స్‌తో బరువు తగ్గడం ఈజీ..!


What is Metabolic Syndrome
What is Metabolic Syndrome

మీరు అనేక రకాల శారీరక సమస్యలను నివారించాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, అధిక ఫైబర్ ఆహారాలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. వివిధ రంగుల పండ్లను తినడం ద్వారా అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి.

మీరు ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే ముందుగా మీ బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టండి. బరువు తగ్గడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత, రక్తపోటును తగ్గించవచ్చు. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

స్మోకింగ్ అలవాటు కూడా జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. కాబట్టి సిగరెట్‌‌ను పూర్తిగా మానేయాలి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Also Read : సడెన్‌గా కండరాలు పట్టేస్తున్నాయా? కారణం ఇదే కావచ్చు!

శారీరక శ్రమతో పాటు ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి. దీని కోసం ధ్యానం, యోగా చేయండి. ఇది ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడటమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ రకమైన జీవనశైలితో మీరు మెటబాలిక్ సిండ్రోమ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు.

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×