Three Different Salutes| దేశభక్తి, క్రమశిక్షణకు మారుపేరు సైన్యం. అందుకే ఆర్మీలో పనిచేసేవారంటే సమజాంలో అందరూ గౌరవిస్తారు. అయితే సైన్యం మూడు విభాగాలుగా విభజించబడింది. ఒక భూతల సైన్యం, రెండో నావికా దళం (నేవీ), వాయు సైన్యం (ఎయిర్ ఫోర్స్). భారత రక్షణ వ్యవస్థ కూడా ఈ మూడు రకాల సైన్యాన్ని కలిగి ఉంది. ఈ మూడు విభాగాలే భారత రక్షణ వ్యవస్థకు మూడు మూల స్తంభాలు.
ఈ మూడు విభాగాలు భారత సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతా బాధ్యతలు కలిసి నిర్వహిస్తాయి. కానీ ఈ మూడు సైన్య విభాగాల గుర్తింపు, సంప్రదాయాలు వేర్వేరు. ఈ మూడు ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్.. దేశం పట్ల తమ త్యాగాన్ని, క్రమశిక్షణని, పరిశ్రమను ఒక సెల్యూట్ ద్వారా అంకిత భావంతో ప్రదర్శిస్తాయి. మిలిటీర సెల్యూట్లు అందరం స్వాతంత్య్ర దినోత్సవం రోజు, లేదా రిపబ్లిక్ డే రోజు పరేడ్ సందర్భంగా చూస్తూ ఉంటాం. అయితే మీరు గమనించారా? ఈ మూడు విభాగాలు సెల్యూట్ చేసే విధానం వేర్వేరుగా ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ ఆర్మీ సెల్యూట్
భారత భూతల సైన్యం.. ఇండియన్ ఆర్మీ సెల్యూట్ చేసే సమయంలో అరచేయి ఎదుటి వ్యక్తి పూర్తిగా చూపిస్తూ మిడిల్ ఫింగర్‌ని తమ హ్యాట్ బ్యాండ్ కు తాకుతూ ఉంటుంది. చేతిలో అన్ని వేళ్లు.. బొటన వేలితో సహా అన్ని సమీపంగా ఉంటాయి. ఈ వేళ్లు కలిసి కట్టుగా ఉండడం.. ఇండియన్ ఆర్మీలోని క్రమశిక్షణ, ఐకమత్యాన్ని సూచిస్తాయి. వేళ్లన్నీ హ్యాట్ కు తాకుతూ ఉండడం యుద్ధం, లేదా ప్రకృతి వైపరీత్యం లాంటి పరిస్థితుల్లో ఒకటే ఆదేశాన్ని పాటిస్తామని హామీ ఇస్తాయి.
ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీ (నావికా దళం) సెల్యూట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అరచేయి 90 డిగ్రీల యాంగిల్ లో నుదుటిని తాకుతూ ఉంటుంది. ఇలా ఎందుకంటే సముద్ర మార్గంలో పయనించే సిబ్బంది షిప్ లోని మురికి, గ్రీస్, ఆయిల్ మట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మురికి చేయికి అంటుకొని ఉన్నా.. దాన్ని తమ సీనియర్ అధికారికి కనిపించకుండా ఉండేందుకు సెల్యూట్ ఈ విధంగా చేస్తారు. అరచేయి భూమి వైపు చూస్తూ ఉంటుంది.
Also Read: వర్క్ ఫ్రమ్ హోం వద్దు.. ఆఫీసుకే వస్తా.. టెకీ నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (భారత వాయు సైన్యం) సెల్యూట్ చేసే సమయంలో చేయి 45 డిగ్రీల తిరిగి ఉంటుంది. ఇలా మధ్య యాంగిల్ లో సెల్యూట్ చేయడం ఇండియన్ నేవీ ప్రత్యేకతం. ఇలా అరచేయి సగం మాత్రమే టర్న చేయడం విమానం పైకి ఎగిరే క్రమాన్ని సూచిస్తుంది. అయితే ఈ సెల్యూట్ విధానాన్ని కేవలం 19 ఏళ్ల క్రితమే మార్చారు. అంతకుముందు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండూ ఒకే విధంగా సెల్యూట్ చేసేవి. కానీ మార్చి 15, 2006 నుంచి ఎయిర్ ఫోర్స్ కు ప్రత్యేక గుర్తింపు కోసం కొత్త సెల్యూట్ విధానం అమలులోకి వచ్చింది.