Mouth Ulcers Causes| మౌత్ అల్సర్స్ అంటే నోటిలో పూత పూయడం. ఇవి పుండులాగా ఉండి భోజనం లేదా ఏదైనా తినే సమయంలో ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇవి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. భోజనం సరిగా జీర్ణం కాకపోవడం, మరీ స్పైసీ ఫుడ్ తినడం లాంటివి. ఈ అల్సర్లు ఒకసారి వస్తే చాలా నొప్పిగా, మండుతూ ఉంటుంది. తినే సమయంలో లేదా ఏదైనా పానీయం తాగే సమయంలోనే కాకుండా సమస్య తీవ్రంగా ఉంటే మాట్లాడే సమయంలో కూడా నొప్పి ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి నోటి పూతలు వస్తే ఫర్యాలేదు. కానీ తరుచూ ఈ సమస్య ఉంటే ఇది చాలా పెద్ద ప్రొబ్లెం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పోషకాహార లోపం
మౌత్ అల్సర్స్ రావడానికి ప్రధాన కారణాలు శరీరానికి పోషకాహారం లభించకపోవడం. ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు లభించకపోతే మౌత్ అల్సర్స్ వస్తాయి. ఈ పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో సెల్స్ నిర్మాణానికి తోడ్పడతాయి. అందుకే ఈ పోషకాలు లేకపోతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.
మానసిక ఒత్తిడి
ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే దాని ప్రభావం అతడి ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్తిపోయి ఈ నోటి పూతల సమస్య తలెత్తుతుంది. కొన్నిసార్లు తగిన నిద్ర లేకపోవడం లేదా అలసట మరీ ఎక్కువగా ఉండడం కూడా ఈ సమస్యకు ఒక కారణం.
హార్మోన్లలో మార్పు
మహిళ్లలో పీరియడ్స్ ఉన్న సమయంలో హార్మోన్లు సమతుల్యంగా ఉండవు. ఈ హార్మోన్ల మార్పుల ప్రభావం చేత చర్మం, నోటి ఆరోగ్యంపై పడుతుంది. ఫలితంగా ఈ మౌత్ అల్సర్స్ వస్తాయి.
ఫుడ్ సెన్సిటివీడీ లేదా అలర్జీలు
కొంతమందికి కొన్ని ఫుడ్స్ అంటే అలర్జీ ఉంటుంది. నట్స్, చాక్లెట్స్, లేదా నిమ్మ, ఆరెంజ్ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ తింటే అలర్జీ ఉన్నప్పుడు చర్మంపై ఇర్రిటేషన్, నోటిలో అల్సర్లు రావడం సహజం. అందుకే ఏదైనా ఫుడ్ తినడం కారణంగా అల్సర్స్ సమస్య వస్తే దాన్ని గుర్తించి ఇకపై తినకపోవడం మంచిది.
Also Read: మనుషులపై దాడి చేసిన రోబో.. షాకింగ్ వైరల్ వీడియో
మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్
ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా యాంటి బయోటిక్స్ లేదా పెయిన్ కిల్లర్ మందులు తీసుకున్నప్పుడు కూడా ఈ నోటి పూతల సమస్య వస్తుంది. అందుకే ఏదైనా మందులు తింటున్న సమయంలో మౌత్ అల్సర్స్ వస్తే వెంటనే డాక్టర్ కు మీ సమస్య గురించి చెప్పాలి.
నోటిలో పళ్ల బ్రేసెస్.. తరుచూ పెదాలు కొరికే అలవాటు
కొంతమంది దంతాల వంకరగా ఉన్న కారణంగా బ్రేసెస్ వేసుకుంటారు. ఈ బ్రెసెస్ నోటిలో రాపిడిని గురిచేస్తాయి. ఆ రాపిడి వల్ల కూడా మౌత్ అల్సర్స్ వస్తాయి. దీంతోపాటు పెదాలు కొరికే అలవాటు ఉన్నా.. బ్రష్ అతిగా చేసినా మౌత్ అల్సర్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది.
నోటి పూత రావడం పెద్ద సమస్య కాదు. కానీ తరుచూ ఈ సమస్య ఉంటే అది ఒక తీవ్ర ఆరోగ్య సమస్యకు సంకేతం. వెంటనే డాక్టర్ ని సంప్రదించి.. తదుపరి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.