Multani Mitti For Face: వేసవి కాలంలో మండే ఎండలు ముఖాన్ని పాడు చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. ముల్తానీ మట్టితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి మీరు టానింగ్‌ను తొలగించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. అంతే కాకుండా మచ్చలను క్రమంగా తొలగించవచ్చు. ముల్తానీ మిట్టితో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ఉపయోగించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ :
ముల్తానీ మిట్టి అనేది చర్మ సంరక్షణలో ఉపయోగించే ఒక సహజ పదార్ధం. ఇది వేసవిలో తెరుచుకునే ముఖ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా జిడ్డు చర్మానికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. వంటగదిలో ఉంచిన కొన్ని హోం రెమెడీస్ ముల్తానీ మిట్టితో కలిపి అప్లై చేయడం వల్ల దాని ప్రయోజనాలు పెరుగుతాయి. అంతే కాకుండా ఇది టానింగ్ నుండి బయటపడటాన్ని మరింత సులభం చేస్తుంది.
పసుపు దాని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ముల్తానీ మిట్టి చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు.. ముఖంపై పేరుకుపోయిన మృత చర్మాన్ని కూడా తొలగిస్తుంది. ముల్తానీ మిట్టితో చేసిన ఫేస్ ప్యాక్‌లో పసుపు కలిపి అప్లై చేస్తే, టానింగ్ సులభంగా తొలగిపోవడమే కాకుండా.. మొటిమల సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది. ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలంటే..
ముల్తానీ మిట్టి పొడి – 3 టీస్పూన్లు
పసుపు – 1 స్పూన్
శనగపిండి – 1 స్పూన్
పెరుగు – 2 టీస్పూన్లు
రోజ్ వాటర్ – 1/2 టీస్పూన్
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. తలమోయలేనంత జుట్టు
ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలి ?
ముందుగా.. అన్ని పదార్థాలను బాగా కలిపి, 10 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఈలోగా మీ ముఖం కడుక్కొని శుభ్రమైన టవల్‌తో తుడవండి. తర్వాత ఈ ప్యాక్‌ను వేళ్ల సహాయంతో లేదా ఫేస్ ప్యాక్ బ్రష్‌తో ముఖం, మెడపై అప్లై చేయండి. దీని తరువాత 15-20 నిమిషాలు ఇలాగే వదిలేసి ఆపై చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి 3 రోజులు వాడితే.. వేసవిలో టానింగ్ సమస్య పెద్దగా ఇబ్బంది పెట్టదు.