Survival Horror Thriller on OTT : రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా రోడ్లు బాగోలేనప్పుడు… అప్పుడప్పుడు ఇంటికి త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో మనమంతా ఏదో ఒక సమయంలో షార్ట్ కట్ రూట్స్ లో వెళ్ళే ఉంటాము. కానీ అలా వెళ్ళడం వల్ల ఎంతటి భయంకర పరిణామాలు ఎదురవుతాయో తెలిస్తే గుండె జారిపోతుంది. అచ్చం ఇలాగే ఫీల్డ్ ట్రిప్ కు వెళ్ళి తిరిగొస్తున్న ఓ స్టూడెంట్స్ బస్… సడన్ గా తీసుకోవాల్సిన వచ్చిన షార్ట్ కట్ తో కథ ఎలాంటి హర్రర్ టర్న్ తిరిగిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ మీ కోసమే. ‘షార్ట్‌కట్’ (Shortcut 2020) అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
కథ బ్రిటన్‌కు చెందిన ఐదుగురు టీనేజ్ స్నేహితులు నోలన్, బెస్, రెగ్గీ, క్వీనీ, కారల్ ల చుట్టూ నడుస్తుంది. తమ స్కూల్ బస్ డ్రైవర్ జోసెఫ్ తో కలిసి ఒక ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళి, తిరిగి వస్తుంటారు. దారిలో ఒక పెద్ద చెట్టు కూలి రోడ్డు బ్లాక్ అవుతుంది. దీంతో జోసెఫ్ అడవి గుండా వెళ్లే ఒక నిర్జనమైన షార్ట్‌కట్ దారిలో ఇంటికి వెళ్దాం అని బస్ ను షార్ట్ కట్ రూట్ లోకి తిప్పేస్తాడు. మొదట్లో అందరూ ఈ అడవి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా ఉంటారు. కానీ ఆ అడవి మార్గం వారిని అనుకోకుండా భయంకరమైన ఆపదలోకి నెట్టేస్తుంది.
వెళ్తూ వెళ్తూ బస్సు హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పటికే చీకటి పడగా… అడవిలో నుంచి ఒక వింతైన, భయంకరమైన రాక్షస జీవి బయటకు వచ్చి బస్సుపై దాడి చేస్తుంది. ఆ జీవి బస్సు డ్రైవర్ జోసెఫ్ ను దారుణంగా చంపేస్తుంది. భయంతో ఆ ఐదుగురు టీనేజర్లు బస్సు నుండి దూకి అడవిలోని ఒక పాత మిలిటరీ టన్నెల్ లోకి పారిపోతారు. కానీ ఆ రాక్షస జీవి వారిని వదలకుండా వెంటాడుతుంది. టన్నెల్‌లో వారికి 1971లో అదే జీవి చేతిలో తన చెల్లిని కోల్పోయిన గియులియో సార్పి అనే సైంటిస్ట్ అస్థిపంజరం దొరుకుతుంది. అతని డైరీలో ఆ జీవి గురించి చాలా భయంకరమైన విషయాలు రాసి ఉంటాయి.
ఆ జీవి సూర్యరశ్మికి భయపడుతుందని, చీకట్లోనే బతకగలదని తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఐదుగురు టీనేజర్లు తమ జీవితాలను కాపాడుకోవడానికి ఒకరినొకరు ఆదుకుంటూ, ఉపాయాలతో ఆ జీవిని టన్నెల్ వెలుపల పగటి వెలుతురులోకి లాగి, నిప్పు పెట్టి అంతం చేయాలని ప్రయత్నిస్తారు. మరి అనుకున్నట్టుగానే ఆ జీవిని చంపేశారా ? దాని నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డారా ? అక్కడి నుంచి ఎంత మంది ఎస్కేప్ అయ్యారు ? అనేది తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.
Also Read : పగటిపూట సైలెంట్ రాత్రైతే వయోలెంట్ ఈ పిల్ల… నలుగురు సార్ల ఎంట్రీతో ట్విస్ట్
హర్రర్ సర్వైవల్ థ్రిల్లర్ ‘షార్ట్ కట్’ అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది, భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. 2020లో విడుదలైన ఈ అమెరికన్-ఇటాలియన్ హారర్ అడ్వెంచర్ చిత్రానికి అలెసియో లిగురీ దర్శకత్వం వహించారు. ఈ క్రీచర్ హారర్ చిత్రం నార్మల్ స్కూల్ ట్రిప్‌ను భయంకరమైన నైట్‌మేర్‌గా మార్చి ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడుతుంది. ప్రస్తుతం Amazon Prime Videoలో ఇంగ్లీష్ ఒరిజినల్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు.