BigTV English

Sleep Problems: సరిగ్గా నిద్రపోవడం లేదా..? అయితే మీ ఆరోగ్యం షెడ్డుకే..!

Sleep Problems: సరిగ్గా నిద్రపోవడం లేదా..? అయితే మీ ఆరోగ్యం షెడ్డుకే..!

Sleep Problems: ప్రస్తుత కాలంలో చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు.. చాలామంది ఏ అర్థరాత్రో నిద్రపోతున్నారు. అయితే కొందరు ప్రశాంతమైన నిద్ర కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సరైన నిద్రనే.. మీ శారీరక, మెంటల్ హెల్త్‌కి చాలా మంచిది. 7-9 గంటల నిద్ర అనేది సోమరితనానికి సంకేతం కాదు. నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన అధ్యయనాల్లో సరైన నిద్ర లేని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. వాటిల్లో డయాబెటీస్ కూడా ఒకటి. స్లీప్ అప్నియా వల్ల మధుమేహం వస్తుందట. నిద్రలేమి కారణంగా శరీరంలో పలు రకాల జీవక్రియ మార్పులకు దారి తీస్తుందట. ఫలితంగా మీ గ్లూకోజ్ స్థాయిలు అనేవి పెరుగుతాయి.


డయాబెటిస్ ముప్పు

నిద్రలేమి వల్ల జీవక్రియకు మందగిస్తుంది, బరువు పెరగడానికి కూడ దారితీస్తుంది. అలాగే నిద్రలేమి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. డయాబెటిస్‌కు కారణమవుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును పెంచుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరు కచ్చితంగా తగినంత నాణ్యమైన నిద్రపోకపోతే శరీరం ఎక్కువ ఒత్తిడిని ప్రేరేపించే హార్మోన్లు, కార్టిసాల్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. య దీనివల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.


హైబీపీ ప్రమాదం

నిద్ర తక్కువైతే హైబీపీకి కారణమవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరైన నిద్ర లేకపోతే ముఖంపైన నల్లటి మచ్చలు, గీతలు, ముడతలు వంటివి కనబడతాయి. ఇవి మీ అందాన్ని తగ్గిస్తాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేలా చేస్తాయి. సరిగా నిద్ర పోకపోతే దాని ప్రభావం జుట్టు పైన కూడా పడుతుంది. జుట్టు బాగా రాలిపోతుంది.

మెదడుకు ఒత్తిడి

ప్రతి ఒక్కరిలో నిద్రపోయే సమయంలోనే మెదడు తనను తాను రిపేర్ చేసుకుని మళ్లీ మరుసటి రోజుకి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఎవరైతే సరిగ్గా నిద్రపోవడం లేదో వారికి ఈ ప్రాసెస్ దెబ్బతింటుంది. దాంతో మెదడు సామర్థ్యం తగ్గుతుంది. ఫలితంగా చేసే పనిలో ప్రొడక్టివిటీ పోతుంది. నిద్రలేమి జీవక్రియను మందగించేలా చేస్తుంది. ఫలితంగా ఆకలి పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: మీకు కొబ్బరి పువ్వు ప్రయోజనాలు తెలుసా?

మానసిక సమస్యలు

సరిగ్గా నిద్రపోకపోతే ఊబకాయం బాధితులుగా మారుతారు. ఈ నిద్రలేమి సమస్య వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని నాశనం చేస్తుంది. అలాగే ఏకాగ్రత లేకుండా చేస్తుంది. కనుక సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలుసుకొని, నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.

నిద్రలేమి నుండి ఉపశమనం పొందడానికి చిట్కాలు

. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్, ట్యాబ్స్, కంప్యూటర్ వాడటం మానుకోండి.
. కాఫీ లేదా టీ తాగడం మానుకోవాలి, భారీ భోజనం తినకూడదు.
. అలాగే నిద్రపోయే ముందు వ్యాయామం చేయకూడదు.
. ప్రతిరోజూ ఇకే సమయంలో పడుకోవడం, మేలుకోవడం చేయాలి.
. నిద్రపోయే గదిని చీకటిగా, చల్లగా ఉంచుకోవాలి.
. మీకు ప్రశాంతమైన నిద్ర కావాలంటే వేడి పాలలో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
. అలాగే చూట్టు  ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

 

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×