Lemon Water: సమ్మర్‌లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో.. నిమ్మరసం కలిపిన నీరు తాగడం చాలా మంచిది. నిమ్మకాయ, చక్కెర ,ఉప్పుతో తయారు చేసే ఈ డ్రింక్ శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. కానీ లెమన్ వాటర్ తప్పుడు సమయంలో తాగడం కూడా శరీరానికి అంత మంచిది కాదు మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ వాటర్ తాగడానికి సరైన సమయం:
1. ఉదయం పూట:
మీ లక్ష్యం బరువు తగ్గడం, శరీరాన్ని డీటాక్స్ చేయడం అయితే, లెమన్ వాటర్ ఉదయం పూట తాగడానికి చాలా మంచి సమయం. ఇది శరీరాన్ని అంతర్గతంగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా బరువు వేగంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
2. భోజనం తర్వాత:
, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత జీర్ణ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ నీరు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అంతే కాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలలో ఉపశమనం అందిస్తుంది.
3. వ్యాయామం తర్వాత:
వ్యాయామం తర్వాత.. శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితిలో లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా అలసట కూడా తొలగిపోతుంది.
లెమన్ వాటర్ ఈ సమయంలో తాగకూడదు ?
1. రాత్రిపూట:
నిమ్మకాయ నీరు రాత్రి పూట తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల అసిడిటీ, అలెర్జీ, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట దీనిని తాగడం మానుకోండి.
2. ఖాళీ కడుపుతో:
నిమ్మకాయలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల హాని జరుగుతుంది.
Also Read: మీ అందం చెక్కు చెదరకుండా ఉండాలంటే.. ?
వీళ్లు లెమన్ వాటర్ తాగకూడదు:
నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఆమ్లత్వను మరింత పెంచుతుంది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.
పళ్ల సమస్యలు: మీరు దంతాల సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే నిమ్మకాయ నీటిని నివారించండి. నిజానికి.. నిమ్మకాయలో ఉండే ఆమ్లం దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇది ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది.
ఎముకల సమస్యలు: ఎముక సంబంధిత సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ నీరు తాగడం మానుకోవాలి లేదా పరిమిత పరిమితంగా మాత్రమే తాగాలి. నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఎముకలలో పేరుకుపోయిన కాల్షియం త్వరగా తొలగిపోతుంది.
కిడ్నీ సమస్యలు: నిమ్మకాయ నీరు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. దీనిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి.