Hit 3 OTT : న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం హిట్ 3.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది వచ్చిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న నాని. తాజాగా నటించిన చిత్రం పై కూడా అంతకుమించి అంచనాలు క్రియేట్. మే డే సందర్భంగా నేడు ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుందని రివ్యూ, పబ్లిక్ టాక్ ను చూస్తే అర్థమవుతుంది.. బీభత్సమైన వైలెన్స్ తో రక్తపాతంతో సాగుతున్న మూవీలో నాని యాక్షన్ వేరే లెవెల్ లో ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ సినిమాతో నాని ఖాతాలో మరో హిట్ పడినట్లే అని తెలుస్తుంది. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ఏ ప్లాట్ ఫామ్ దక్కించుకుందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
హిట్ 3 ఓటీటీ డీటెయిల్స్..
స్టార్ హీరోనాని నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. నానికి జోడీగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ నటించగా ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రీసెంట్ గా నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కోర్టు మూవీ భారీ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ మూవీ తో మరో హిట్ అకౌంట్ లో పడింది. మొదటి నుంచి ఈ యాక్షన్ మూవీ పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. రిలీజ్ అయిన అప్డేట్స్ పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూ.54 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. అలాగే అయిదు వారాల ఒప్పందం కుదుర్చుకుంది. జూన్ సెకండ్ వీక్ లో ఈ మూవీ ని స్ట్రీమింగ్ తీసుకురావాలని అనుకుంటున్నారు.
Also Read : అయ్యో పాపం.. స్టేజ్ మీదనే ఏడ్చేసిన రిషి..కన్నీళ్లు ఆపుకోవడం కష్టమే..
స్టోరీ విషయానికొస్తే..
హిట్ 3 మూవీలో నాని పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సర్కార్ గా నటించాడు. ప్రతి విషయంలో విచ్చల విడిగా బూతులు మాట్లాడుతూ తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ఒక క్యారెక్టర్ లో నటించాడు. ఆ కేసును సాల్వ్ చేయడంలో నాని ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాడు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించారు. మొదటినుంచి స్టోరీ చివరి వరకు సినిమాని చాలా ఎంగేజింగ్ గా నడిపించడంలో శైలేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ తను రాసుకున్న స్క్రీన్ ప్లే లో ఎక్కడా కూడా డౌటు రాకుండా ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు.. మర్డర్ చేసిన వ్యక్తులు ఎవరో తెలియకుండానే ఫేస్ ని రివిల్ చేయకుండానే ఈ సినిమాని మొత్తాన్ని నడిపించాడు. ఎప్పుడు కూల్ గా కనిపించే నాని ఈ సినిమాతో యాక్షన్ హీరో అయిపోయాడు. దసరాకు మించి ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉండటంతో ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తుంది. కలెక్షన్స్ ఏమాత్రం ఉంటాయో తెలియాల్సింది..