E-Paper
Advertisement

ప అక్షరంతో మొదలయ్యే పేరు గల అమ్మాయిలు చాలా స్పెషల్.. అందరి దృష్టిని ఆకర్షించే ఈ గుణాలు వీరి సొంతం

ప అక్షరంతో మొదలయ్యే పేరు గల అమ్మాయిలు చాలా స్పెషల్.. అందరి దృష్టిని ఆకర్షించే ఈ గుణాలు వీరి సొంతం
Advertisement

పేరు మొదటి అక్షరం వ్యక్తిత్వంపై కొంత ప్రభావం చూపుతుందని నామ జ్యోతిష్యం సూచిస్తుంది. చాలామంది ఇది నమ్మకం. న్యూమరాలజీ ప్రకారం కూడా పేరు ప్రారంభ అక్షరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా P అంటే ‘ప’ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. వీరు తమ ఆత్మవిశ్వాసం, నిజాయితీ, సృజనాత్మకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. అయితే నిజమైన వ్యక్తిత్వం పేరుతో పాటు కుటుంబం, పెంపకం, అనుభవాలు వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

ప్రశాంతమైన స్వభావం

P అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కోపపడకుండా పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించడానికి ప్రయత్నిస్తారు. అనవసర వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలని భావిస్తారు. వారి ప్రశాంతమైన తీరు ఇతరుల గౌరవాన్ని పొందేలా చేస్తుంది.

నిజాయితీ ఎక్కువగా ఉంటుంది

Advertisement

ఈ అమ్మాయిలు నిజాయితీకి చాలా ప్రాధాన్యం ఇస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే అలవాటు వీరికి ఉండదు. ఇతరుల గురించి వారు లేనప్పుడు చెడుగా మాట్లాడటాన్ని కూడా ఇష్టపడరు. అందుకే కుటుంబ సభ్యులు, స్నేహితులు వీరిని సులభంగా నమ్ముతారు.

ప్రేమలో నిబద్ధత చూపుతారు

ప్రేమ, సంబంధాల విషయంలో వీరు చాలా సీరియస్‌గా ఉంటారు. తొందరగా ఎవరికీ మనసు ఇవ్వరు. కానీ ఒకసారి సంబంధాన్ని అంగీకరిస్తే చివరివరకు నిజాయితీగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. కష్టసుఖాల్లో తమ భాగస్వామికి అండగా ఉంటారు.

ఆత్మాభిమానం, స్వతంత్ర భావాలు

Advertisement

ఈ అమ్మాయిలకు ఆత్మగౌరవం చాలా ముఖ్యం. జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తామే తీసుకోవాలని కోరుకుంటారు. కష్టపడి పని చేసి స్వంతంగా ఎదగాలని భావిస్తారు. ఇతరులపై పూర్తిగా ఆధారపడటాన్ని ఇష్టపడరు.

క్రియేటివ్‌గా ఆలోచిస్తారు

P అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలలో చాలామందికి కళలపై ఆసక్తి ఉంటుంది. సంగీతం, నృత్యం, పెయింటింగ్, రచన లేదా ఫ్యాషన్ వంటి రంగాల్లో ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలను వ్యక్తపరచడంలో వీరు ముందుంటారు.

సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు

వీరు దయగల మనసు కలిగి ఉంటారు. కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సహాయం చేయడానికి వెనుకాడరు. ఇతరుల పట్ల చూపే ప్రేమ, సానుభూతి కారణంగా కుటుంబంలో, సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు.

Also Read: ఆఫీస్‌కు వెళ్లే మహిళల కోసం 4 స్టైలిష్ డ్రెస్ ఐడియాలు.. అందరి చూపు మీ పైనే

కొత్త వారితో త్వరగా కలివిడిగా ఉండరు

మొదటిసారి కలిసినప్పుడు వీరు కొద్దిగా మౌనంగా లేదా సిగ్గుగా కనిపించవచ్చు. ప్రతి ఒక్కరితో వెంటనే తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరు. నమ్మకం ఏర్పడిన తర్వాత మాత్రం మనసు విప్పి మాట్లాడతారు. ఈ స్వభావమే వారిని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.

డబ్బు తెలివిగా ఖర్చు చేస్తారు

ఈ అమ్మాయిలకు మంచి వస్తువులు, అందమైన జీవనశైలి ఇష్టం ఉంటుంది. అయితే అవసరం లేని ఖర్చులు చేయరు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు కూడా చేస్తారు. అత్యవసర పరిస్థితుల కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

Related News

జలుబు,ఫీవర్ టైమ్‌లో నోటికి రుచిగా..ఘాటైన రొయ్య పొట్టు చారు ఇలా ట్రై చేయండి!

రోటీ,బిర్యానీలోకి అదిరిపోయే కాంబినేషన్..రాయల్ మొగలాయ్ ఎగ్ కర్రీ సీక్రెట్ రెసిపీ!

ఒక్కసారి పెడితే ఏడాదంతా నిల్వ..సగ్గుబియ్యం వడియాలు ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

బరువు తగ్గించి,షుగర్‌ కంట్రోల్ చేసే కమ్మని కొర్రల కిచిడీ!

సాధారణ బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టిందా? రుచి మార్చే సింపుల్ రెసిపీస్!

టీనేజర్లకు కాల్స్ కంటే టెక్స్టింగ్ ఎందుకు ఇష్టం?5 ఆసక్తికర కారణాలివే!

పొట్లకాయ పెరుగు పచ్చడి..వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది!

నెల రోజుల పాటు నిల్వ ఉండే..గుంటూరు స్పెషల్ అల్లం పచ్చడి!

Big Stories

Advertisement
×