BigTV English

Fridge: ఈ ఫుడ్స్‌ అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకండి.. అవేంటంటే ?

Fridge: ఈ ఫుడ్స్‌ అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకండి.. అవేంటంటే ?

Stop Refrigerating These foods : ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్ల వాడకం సర్వ సాధారణంగా మారింది. మన దేశంలో రిఫ్రిజిరేటర్లు ఇప్పుడు సాధారణ అవసరంగా మారాయి. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో ఫ్రిజ్ లు వాడుతున్నారు. కానీ వీటి వినియోగంపై కొందరికి అవగాహన లేదు. ఎలాంటి ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. వేటిని పెట్టకూడదో ముందుగా తెలుసుకోవాలి. కొన్ని రకాల కూరగాయలు, ఫుడ్ ఐటమ్స్ ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే అవి విషంగా మారతాయి అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.


చాలా మంది వండిన ఆహార పదార్థాలను పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడతారు. అంతే కాకుండా కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లలో ఉంచుతారు. సరైన ఉష్ణోగ్రతను మెయింటెన్ చేస్తే ఆహార పదార్థాలు కొంతకాలం తర్వాత కూడా వినియోగించడానికి బాగుంటాయి. కానీ కొన్నింటిని మాత్రం రిఫ్రిజిరేటర్‌లో పెట్టాక 24 గంటలలోపు తినేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్థాలను ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఫ్రిజ్‌లో పెడితే అవి సూపర్ టాక్సిన్ లుగా మారతాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయలు: ఇది తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే పంట అయితే ఆనియన్స్ ను ఎప్పుడుూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఒకవేళ ఫ్రిజ్‌లో వీటిని స్టోర్ చేస్తే ఉల్లిపాయల్లోని పిండిపదార్థం చక్కెరగా మారుతుంది. దీంతో ఇవి త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది. చాలా మంది ఉల్లిపాయను కోసి సగాన్ని వంటలో వాడతారు మిగిలిన సగం భాగాన్ని ఫ్రిజ్‌లో పడతారు ఇలా చేయడం వల్ల ఆనారోగ్యకరమైన బ్యాక్టీరియాలను ఆకర్షించి ఇవి పాడవుతాయి.


వెల్లులి: ఒలిచిన వెల్లుల్లిని మార్కెట్ నుంచి అస్సలు కొనుగోలు చేయకూడదు. అలాగే వాటిని ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయకూడదు ఎందుకంటే ఒలిచిన చిన్న వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే వాటిపై మచ్చలు,బూజు ఏర్పడి అవి పాడైపోతాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వెల్లుల్లిని గడ్డలుగా ఉన్నప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి. అవసరమైతే వాటిని ఒలిచిన వెంటనే వంటల్లో ఉపయోగించుకోవాలి.

అన్నం: చద్దన్నం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతారు. అయితే కొందరు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఆ తర్వాత రోజు తింటూ ఉంటారు. స్టార్స్ రెసిస్టెన్స్ కారణంగా కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కానీ త్వరగా చెడిపోయే లక్షణాలు ఉన్న అన్నాన్ని వండిన వెంటనే
తినాలి. ఒకవేళ రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి అనుకుంటే 24 గంటలకు మించి ఉంచకూడదని గుర్తుంచుకోండి.

Also Read: ఆయుర్వేద మూలికలతో మొటిమలు, మచ్చలకు చెక్..!

అల్లం: అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి. దీన్ని వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొందరు టీ తయారీలోనూ ఉపయోగిస్తారు. జలుబు, ఫ్లూ రిస్కును ఇది తగ్గిస్తుంది. అయితే అల్లంను ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టవచ్చు. దీని అలాగే వాడితే మూత్రపిండాలు, కాలేయ వైఫల్యం సమస్యలు రావచ్చు. అందుకే అల్లంను ఫ్రిజ్‌లో స్టోర్ చేయడానికి బదులు బయట ఉంచి వాడడం మంచిది.

Related News

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Big Stories

×