Online Food Delivery Safety: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌లో వంట చేసుకునే.. టైం లేక చాలా మంది ఆన్ లైన్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం ఒక్క క్లిక్‌తో.. నచ్చిన ఆహారం ఇంటికి వస్తుండటంతో దీని ఆదరణ విపరీతంగా పెరిగింది. అయితే.. ఇలా తెప్పించుకునే ఆహారం ఎంత వరకు పరిశుభ్రంగా ఉంటోంది? ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఎంత వరకూ సేఫ్ అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ నేపథ్యంలో..కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న భద్రతా నియమాలు, డెలివరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో కూర్చొనే.. నగరంలోని ఏ హోటల్ డిష్ నైనా టేస్ట్ చేసే అవకాశం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ తెచ్చిపెట్టాయి. అయితే.. సౌకర్యంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన సేఫ్టీ కూడా ఇక్కడ ప్రధానమైనదే. రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించడం, సరిగ్గా ఉడికించని.. పదార్థాలు లేదా నాణ్యత లేని నూనెలను వాడటం వల్ల కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే పార్సిల్ చేసే సమయంలో ప్యాకింగ్ సరిగ్గా లేక పోవడం వల్ల బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువ రేటింగ్ ఉన్న రెస్టారెంట్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఫుడ్ డెలివరీ తీసుకునే సమయంలో కొన్ని సాధారణ విషయాలను గమనించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.
1. ప్యాకింగ్ : ఫుడ్ బాక్స్ లేదా ప్లాస్టిక్ కవర్స్ సీల్ చెక్కుచెదరకుండా… ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఎక్కడైనా లీకేజ్ ఉంటే.. వెంటనే కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలి.
2.టెంపరేచర్ చెక్: వేడిగా తినాల్సిన ఆహారం వేడి గాను, కూల్ ఐటమ్స్ చల్లగాను ఉన్నాయో లేదో చూసుకోవాలి. పాడైపోయిన వాసన వస్తే.. వాటిని తినక పోవడమే మంచిది.
3. డెలివరీ పర్సన్ హైజీన్: డెలివరీ బాయ్స్ పరిశుభ్రమైన బట్టలు ధరించడం, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం వంటివి గమనించవచ్చు.
Also Read: ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!
కస్టమర్ల ఆరోగ్యాన్ని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఆన్ లైన్ క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లు తూచా తప్పకుండా హైజీన్ రూల్స్ పాటించాలని ఆదేశించాయి. అంతే కాకుండా ఫుడ్ ప్యాకింగ్‌పై తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, పదార్థాల వివరాలను స్పష్టంగా తెలపడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే రెస్టారెంట్లపై భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనేది మన డైలీ లైఫ్‌లో.. ఒక భాగమైపోయింది. అయితే.. సౌలభ్యం కోసం ఆరోగ్యంతో చెలగాటమాడకుండా.. మంచి రేటింగ్ ఉన్న రెస్టారెంట్లను ఎంచుకోవడం, డెలివరీ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించడం మన బాధ్యత. ప్రభుత్వ నిబంధనలు కూడా అమలవుతున్న తరుణంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉంటే మంచి ఆహారాన్ని పొందొచ్చు.