October 2026 OTT Releases list: ఓటీటీ ప్రేక్షకులకు అక్టోబర్ నెల ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో సిద్ధమైంది. ఈ నెల దసరా పండగతో పాటు ఎంటర్టైన్మెంట్ బొనాంజా కూడా అన్నమాట. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, యానిమేషన్, హారర్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రియాలిటీ షోలతో దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. ముఖ్యంగా మొదటి వారంలోనే ‘దుపహియా సీజన్ 2’, ‘ఓ మై డాగ్’, ‘ఈస్ట్ ఆఫ్ ఈడెన్’, ‘రోమాంచకమ్’, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ లాంటి ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి అక్టోబర్‌లో ఏ రోజు ఏ సినిమా, సిరీస్ ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.
అక్టోబర్ 1న ప్రైమ్ వీడియోలో ‘దుపహియా సీజన్ 2’ స్ట్రీమింగ్ అవుతోంది. అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో పంకజ్ త్రిపాఠి నటించిన ‘ఓ మై డాగ్’ వస్తోంది. అదే అక్టోబర్ 1న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఈస్ట్ ఆఫ్ ఈడెన్’ అనే ఏడు ఎపిసోడ్‌ల సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగువారికి ప్రత్యేకంగా ఆసక్తి కలిగించే ‘రోమాంచకమ్’ కూడా ఇదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్టోబర్ 2న మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి నటించిన ‘పూజా మేరీ జాన్’ జీ5లోకి వస్తోంది.
జియోహాట్‌స్టార్‌లో మలయాళ సెన్సేషన్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ స్ట్రీమింగ్ కానుంది. నివిన్ పౌలీ, మమిత బైజు నటించిన ఈ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. 15న ప్రైమ్ వీడియోలో ‘ది ట్రేటర్స్ తెలుగు’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ రెండో భాగంలో కూడా లైనప్ భారీగానే ఉంది. అక్టోబర్ 16న ‘రోడీస్ రీబర్త్’, 19న ‘లవ్ ఇన్ డిస్గైజ్’, 21న ప్రైమ్ వీడియోలో ‘ది టెర్మినల్ లిస్ట్’ సీజన్ 2, 24న ‘ఫైనల్ టేబుల్’, అక్టోబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది వన్ అబౌట్ మ్యాథ్యూ పెర్రీ’ రానున్నాయి. మొత్తంగా చూస్తే హారర్ నుంచి థ్రిల్లర్ వరకు, కామెడీ నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అక్టోబర్ నెల ఓటీటీలో పెద్ద లిస్ట్‌నే తీసుకొస్తోంది.
అక్టోబర్ 01 దుపహియా సీజన్ 2 (Dupahiya Season 2) – ప్రైమ్ వీడియో
అక్టోబర్ 01 ఓ మై డాగ్ (Oh My Dog)- నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 01 ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (East of Eden) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 01 రోమాంచకమ్ (Romanchakam) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 01 క్రేజీ రిచ్, ఇన్‌క్రెడిబ్లీ బ్రోక్ (Crazy Rich, Incredibly Broke) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 01 పంథడిక్కమ్ (Panthadikkam)- జీ5
అక్టోబర్ 02 పూజ మేరీ జాన్ (Pooja Meri Jaan) – జీ5
అక్టోబర్ 02 లవ్ (Love) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 02 బెత్లహేమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) – జియో హాట్‌స్టార్
అక్టోబర్ 02 మదర్ ప్రామిస్ (Mother Promise) – జీ5
అక్టోబర్ 02 డూయింగ్ లైఫ్ (Doing Life) – ప్రైమ్ వీడియో
అక్టోబర్ 03 రన్మా ½ సీజన్ 3 (Ranma ½ Season 3) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 04 బ్లూ బాక్స్ సీజన్ 2 (Blue Box Season 2) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 07 క్యారీ (Carrie) – ప్రైమ్ వీడియో
అక్టోబర్ 08 బిలో (Below) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 09 మ్యాచ్‌బాక్స్: ది మూవీ (Matchbox: The Movie) – యాపిల్ టీవీ+
అక్టోబర్ 09 యానిమల్స్ (Animals) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 13 సోలార్ అపోజిట్స్ సీజన్ 6 (Solar Opposites Season 6) – హులు
అక్టోబర్ 14 విజన్ క్వెస్ట్ (Vision Quest) – జియోహాట్‌స్టార్
అక్టోబర్ 14 లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (Love Is Blind Season 11) – నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 15 ది ట్రేటర్స్ తెలుగు (The Traitors Telugu)- ప్రైమ్ వీడియో
అక్టోబర్ 16 రోడీస్ రీబర్త్ (Roadies Rebirth) – నెట్‌ఫ్లిక్స్ / జియోహాట్‌స్టార్
అక్టోబర్ 19 లవ్ ఇన్ డిస్గైజ్ సీజన్ 1 (Love in Disguise Season 1) – ప్రైమ్ వీడియో
అక్టోబర్ 21 ది టెర్మినల్ లిస్ట్ సీజన్ 2 (The Terminal List Season 2) – ప్రైమ్ వీడియో
అక్టోబర్ 24 ఫైనల్ టేబుల్ సీజన్ 1 (Final Table Season 1) – ప్రైమ్ వీడియో
అక్టోబర్ 27 ది వన్ అబౌట్ మ్యాథ్యూ పెర్రీ (The One About Matthew Perry) – నెట్‌ఫ్లిక్స్