BigTV English

TTD News: భక్తుల అమాయకత్వమే ఆయుధం.. తిరుమలలో మళ్లీ మోసం.. అసలేం జరిగిందంటే?

TTD News: భక్తుల అమాయకత్వమే ఆయుధం.. తిరుమలలో మళ్లీ మోసం.. అసలేం జరిగిందంటే?

TTD News: శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామని బురిడీ కొట్టించే వారు రోజుకొకరు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుండి బురిడీ కేటుగాళ్ల భరతం పడుతోంది టీటీడీ. అనతికాలంలోనే భక్తుల ఫిర్యాదుల మేరకు పలువురిని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. అలాగే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కానీ టీటీడీ ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది కేటుగాళ్లు, భక్తుల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ నియమ నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని, మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ టీటీడీ పలుమార్లు హెచ్చరించింది. శ్రీవారి దర్శనార్థం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా భక్తులు తిరుమలకు వస్తారు. అలా వచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని పలువురు మోసగించిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వచ్చేవి. ఒక్కొక్కరిని టీటీడీ ఏరివేస్తుండగా, మోసగాళ్ళు మాత్రం పుట్టుకు వస్తూనే ఉన్నారు. ఇలాంటి వారి ఆగడాలు సాగకుండా టీటీడీ ప్రత్యేక నిఘా ఉంచింది. భక్తులను ఎవరైనా శ్రీవారి దర్శనం పేరిట మోసం చేస్తే, తప్పక తమ దృష్టికి తీసుకురావాలని, వారిని వదిలి పెట్టమంటూ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.

ఇదే రీతిలో తాము మోసపోయామని పలువురు భక్తులు శుక్రవారం టీటీడీ దృష్టికి తీసుకువచ్చారు. పూణేకు చెందిన ప్రకాష్ విష్ణువర్ధన్ అనే భక్తుడు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేందుకు డైక్ టూర్స్ కార్పొరేషన్ కు చెందిన చంద్రలేఖ గోపాల్ ను సంప్రదించాడు. ప్రకాష్ కు బ్రేక్ దర్శనం కల్పిస్తామని, చంద్రలేఖ గోపాల్ ఏకంగా రూ. 70 వేలు నగదును తీసుకున్నాడు. వీరి మాటలు నమ్మిన ప్రకాష్ తిరుమలకు రాగా, ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై రూ. 300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి పంపించారు. అప్పుడు అసలు విషయం తెలుసుకున్న ప్రకాష్ నేరుగా టీటీడీకి ఫిర్యాదు చేశాడు. శ్రీవాణి టికెట్ల పేరుతో మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని టీటీడీ విజిలెన్స్ దృష్టికి ప్రకాష్ తీసుకెళ్ళాడు.


Also Read: Today Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్

ఇక అంతే రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అసలు విషయాన్ని గ్రహించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డైక్ టూర్స్ కార్పొరేషన్ కు చెందిన చంద్రలేఖ గోపాల్, ట్రావెల్ ఏజెంట్ శరవణన్, శరత్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. మోసగాళ్ల మాటలు విని భక్తులు మోసపోవద్దని, ఎన్ని సార్లు టీటీడీ హెచ్చరించినా ఇలాంటి ఘటనలు జరగడం విశేషం, ఇప్పటికైనా భక్తులు అప్రమత్తంగా ఉండి, అనవసరంగా డబ్బులు వృథా చేసుకోవద్దని టీటీడీ సూచిస్తోంది. అలాగే ఇలాంటి వారి సమాచారాన్ని తమకు తెలియజేయాలని టీటీడీ కోరింది. శ్రీవారి భక్తులూ.. తస్మాత్ జాగ్రత్త సుమా.. ఏ సందేహం ఉన్నా టీటీడీ అధికారులను సంప్రదించండి.. ఇలాంటి మోసాల బారిన పడితే తప్పక వారి దృష్టికి తీసుకెళ్లండి.

Related News

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Big Stories

×