BigTV English

Early Onset Diabetes: చిన్న వయసులోనే డయాబెటీస్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

Early Onset Diabetes: చిన్న వయసులోనే డయాబెటీస్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

Early Onset Diabetes| ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం వ్యాధి ఒక సీరియస్ సమస్యగా మారింది. అయితే ప్రపంచదేశాలలో కెల్లా అత్యధికంగా షుగర్ వ్యాధి బాధితులు ఇండియాలోనే ఉండడం చాలా ఆందోళనకర విషయం. భారతదేశాన్ని ప్రపంచ మధేమేహ రాజధాని అని పిలుస్తారు. గత మూడు దశాబ్దాలు భారత దేశంలో మధుమేహం బారిన పడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మధుమేహ బాధితులు సాధారణంగా 40 ఏళ్ల వయసు పైబడిన వారుంటారు. కానీ తక్కువ వయసులోనే షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య కూడా పెరగడం దేశంలో ఆందోళనకర పరిస్థితులను సూచిస్తోంది.


డయాబెటీస్ (షుగర్ వ్యాధి) నిపుణులు సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ను తక్కువ వయసులో మధుమేహం రావడానికి కారణాలుగా చెబుతున్నారు.

డయాబెటీస్ ఎలా వస్తుంది?
మానవ శరీరంలో ప్రకృతిపరంగా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడం. లేదా తగిన స్థాయిలో కంటే తక్కువ ఉత్పత్తి జరగితే అప్పుడు వైద్య పరిభాషలో దానిని డయబెటీస్ సమస్యగా గుర్తించారు. మన శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ అంటే చక్కెర్ స్థాయిని నియంత్రించేందుకు పాన్ క్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. కానీ పాన్ క్రియాస్ సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. ఈ సమస్య సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది. కానీ ఇటీవలి కాలంలో 40 కంటే తక్కువ వయసుగల వారికి కూడా డయాబెటీస్ సమస్య ఎదురవుతోంది.


ఆరోగ్య నిపుణుల ప్రకారం.. దీనికి ముఖ్య కారణం మనుషుల్లో జన్యపరంగా లేదా వంశపారంపర్యంగా ఈ సమస్య తరతరాలు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ సమస్య చిన్న వయసులోనే ప్రారంభం కావడం ఆందోళనకరం. తక్కువ వయసులో డయాబెటీస్ రావడానికి కారణాలు.. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తక్కువ నిద్రపోవడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. ఇవే డయాబెటీస్ సమస్య యువతలో తలెత్తడానికి కారణాలు.

Also Read: డీప్ ఫ్రై చేసేందుకు బెస్ట్ అండ్ వరస్ట్ వంటనూనెలు ఇవే..!

అయితే ఈ సమస్య రాకుండా జాగ్రత్తలు పాటించవచ్చు.

1. ఆహారంలో తక్కువ కార్బ్స్ తీసుకోవాలి: ఆధునిక జీవనశైలిలో ఎక్కువగా ప్రాసెసెడ్ ఫుడ్, జంక్ ఫుడ్, రెడీ టు ఈట్ ఆహారం తినడం అందరికీ అలవాటు అయిపోయింది. ఆహారం వండే ఓపిక తగ్గిపోవడంతో తరుచూ ఇన్స్ టంట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాసెసెడ్ ఫుడ్, జంక్ ఫుడ్ లో ఎక్కువ కార్బొహ్రైడ్రేట్స్ ఉంటాయి. అయితే శరీరానికి అవసరమైనంత కార్బొహైడ్రేట్స్ మాత్రమే భోజనంలో తీసుకోవాలి. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతి రోజు భోజనంలో రాగి, జొన్న, క్వినోవా, బాజ్రా, మిల్లెట్స్ లాంటివి తీసుకోవాలి.

2. ఆహారంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ తీసుకోవాలి: అందరూ అనుకుంటున్నట్లు ఫ్యాట్ ఆరోగ్యానికి హానికరం కాదు. అయితే ఎక్కువ మోతాదు ఫ్యాట్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. నేయి, కొబ్బరి నూనె, అవకాడో, బాదం, కాజు, పిస్తా లాంటి పప్పులతో పాటు మాంసాహారంలో అయితే చికెన్, చేప అప్పుడప్పుడూ మటన్ తీసుకోవాలి. శాఖాహారులైతే ప్రోటీన్ కోసం పప్పు దినుసులు, చిక్కుడు కాయలు, వేరు శెనగ, స్ప్రౌట్స్ లాంటివి తీసుకోవాలి.

3. ఫిట్ నెస్ కోసం ఎక్సైజ్ చేస్తూ చురుకుగా ఉండాలి: ఆరోగ్యంగా ఉండేందుకు శరీరం ఫిట్ గా ఉండడం చాలా అవసరం. మనం రోజూ తినే ఆహారం చక్కగా అరిగితే దాని వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అందుకోసం ప్రతి రోజు ఎక్సైజ్ చేయాలి. ప్రతి రోజు కార్డియో లాంటి ఎక్సైజ్ చేస్తే.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కండరాలకు కదిలిక జరుగుతూ ఉంటే శరీరంలోని ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణ లో ఉంటాయి.

ఈ మూడు చిట్కాలు పాటించడం చాలా సులువు. అందుకే క్రమం తప్పకుండా పాటించండి. మధుమేహాన్ని నివారించండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×