E-Paper
Advertisement

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!
Advertisement

5G Coverage: ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొని.. మంచి డేటా ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నప్పటికీ నెట్ స్పీడ్ ఆశించిన స్థాయిలో లేకపోతే వచ్చే కోపం, అసహనం అంతా ఇంతకాదు. అయితే ఇక్కడ సమస్య ఫోన్‌లోనో లేదా రీఛార్జ్ ప్లాన్‌లోనో ఉండకపోవచ్చు. మీరు ఉన్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్ పరిధి సరిగ్గా లేకపోవడమే దానికి ప్రధాన కారణం కావచ్చు. అందుకే కొత్త సిమ్ కార్డ్ తీసుకునే ముందు లేదా ఏదైనా ప్రాంతానికి మారాల్సిన వచ్చినప్పుడు అక్కడ ఏ కంపెనీకి చెందిన 5జీ నెట్‌వర్క్ సరిగ్గా అందుబాటులో ఉందో సరిచూసుకోవడం ముఖ్యం. ప్రధాన టెలికాం సంస్థలైన ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియాలో 5G నెట్ వర్క్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

జియో 5జీ చెకింగ్..

ఒకవేళ మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే మీ ఏరియాలో జియో 5G నెట్ వర్క్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో కావాలి. ముందుగా జియో అధికారిక ‘కవరేజ్ పోర్టల్’ (Coverage Portal) ఓపెన్ చేయాలి. స్క్రీన్ పై ఎడమవైపు ఎగువ భాగంలో 4G+5G, 5G, లేదా 4G ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్ కవరేజ్ చూడటానికి ‘5G’ బటన్‌పై క్లిక్ చేయాలి. సెర్చ్ బాక్స్‌లో మీ ప్రాంతం పిన్ కోడ్ (PIN code) ఎంటర్ చేయాలి. లేదా ఫోన్‌లో జీపీఎస్ (GPS) పర్మిషన్ ఇచ్చి ‘Use your current location’ బటన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు ఉన్న ప్రాంతం కవరేజ్‌ను తెలుసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ 5G చెకింగ్

Advertisement

ఎయిర్ టెల్ యూజర్లు అయితే అధికారిక నెట్‌వర్క్ కవరేజ్ పోర్టల్‌ ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే ఆకుపచ్చ రంగు ‘5G’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఎయిర్‌టెల్ 5జీ కవరేజ్ వివరాలను చూడొచ్చు. తర్వాత మీ అడ్రస్ లేదా పిన్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లేదా లైవ్ లొకేషన్ ఇవ్వాలి. అప్పుడు మీరు ఉంటున్న ఏరియాలో 5G ఉందో లేదో తెలుస్తుంది.

Also Read: ప్రపంచంలోనే 5 బెస్ట్ రైలు ప్రయాణాలు.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

వీఐ 5G చెకింగ్…

Advertisement

వీఐ యూజర్లు అయితే ఆ కంపెనీకి చెందిన అధికారిక కవరేజ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. స్క్రీన్ కింద భాగంలో ఎడమవైపు ఉన్న డ్రాప్‌డౌన్ మెనూ నుంచి మీరు చెక్ చేయాలనుకుంటున్న నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి. ఆపై సెర్చ్ బాక్స్‌లో మీ చిరునామా లేదా పిన్ కోడ్ నమోదు చేయడం ద్వారా గానీ, లైవ్ లొకేషన్ ఆన్ చేయడం ద్వారా గానీ మీ ప్రాంతంలో 5జీ కవరేజ్ ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.

Also Read: రెస్టారెంట్లపై ఉక్కుపాదం.. నగరవాసుల నీరాజనం.. ఈ ఐఏఎస్ రూటే సెపరేటు!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×