Seasonal Infections: వాతావరణం మారినప్పుడు మనం అనారోగ్యానికి గురికావడానికి ఇన్‌ఫ్లుఎంజా ఇన్‌ఫెక్షన్ అతిపెద్ద కారణం. అనుకూలమైన వాతావరణంలో ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా వ్యాధుల బారిన పడవచ్చు. దీని లక్షణాలలో జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు, ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారడం, అలసట, బలహీనత వంటివి ఉంటాయి.
ఇన్ఫ్లుఎంజా ఇన్ఫెక్షన్లు సాధారణంగా కొన్ని రోజుల్లోనే వాటంతట అవే లేదా కొంత చికిత్స తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ అంతర్గతంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్లూ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
జ్వరం లేదా ఫ్లూ :
సీజనల్ జ్వరం లేదా సీజనల్ ఫ్లూ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది సీజన్ మారినప్పుడు ఎక్కువగా వస్తుంటుంది. ఇది ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం , వసంతకాలంలో వ్యాపిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, పోషకాహార లోపంతో బాధపడేవారు లేదా ఇప్పటికే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఈ రకమైన ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇదే కాకుండా ఫ్లూ, జ్వరంతో ఉన్న వారికి సమీపంగా ఉన్నా కూడా లేదా తుమ్మడం, దగ్గు ద్వారా విడుదలయ్యే బిందువులు వ్యాపించినా కూడా మీకు జ్వరం, జలుబు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సీజనల్ ఫీవర్ సాధారణంగా తక్కువ, ఎక్కువ రోజులు ఉంటుంది. అది మిమ్మల్ని ఎలా అనారోగ్యానికి గురి చేస్తుందనేది మీ వ్యక్తి రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.
ఎలాంటి లక్షణాలు కలుగుతాయి ?
సాధారణంగా సీజన్ మారినప్పుడు ఫ్లూ లక్షణాలపై ప్రతి ఒక్కరూ తీవ్ర శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జ్వరం (తేలికపాటి , అధిక జ్వరం)
తలనొప్పి , శరీర నొప్పి
గొంతు నొప్పి
జలుబు
దగ్గు (పొడి లేదా శ్లేష్మంతో)
శరీరంలో బలహీనత, అలసట
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (తీవ్రమైన సందర్భాల్లో)
జ్వరం 102°F కంటే ఎక్కువగా ఉంటే, మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే లేదా లక్షణాలు 7-10 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
1.కొన్ని హోం రెమెడీస్ తో పాటు మందులతో సీజనల్ ఫ్లూను సులభంగా నయం చేయగలిగినప్పటికీ కొంత మందిలో ఇది తీవ్రమైన వ్యాధులకు దారితీసే సమస్యను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఉబ్బసం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఫ్లూ ఇన్ఫెక్షన్ కూడా ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.
2.మూత్రపిండాలు, కాలేయం, నాడీ సంబంధిత సమస్యలు లేదా గుండె లేదా రక్తనాళాల వ్యాధి ఉన్నవారిలో కూడా ఫ్లూ ఇన్ఫెక్షన్ సమస్యలను కలిగిస్తుంది.
HIV/AIDS, క్యాన్సర్, డయాబెటిస్ వంటి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో కూడా తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
సికిల్ సెల్ వ్యాధి ఉన్నవారికి కూడా ఈ సమస్యలు ఉండవచ్చు.
3. 5 సంవత్సరాల కంటే తక్కువ లేదా 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సీజనల్ వ్యాధులు ఎక్కవ వస్తాయి.
గర్భవతిగా లేదా ఊబకాయంతో ఉన్నవారిలో కూడా ఫ్లూ పెరుగుతుంది.
Also Read: ఉదయం పూట ఈ జ్యూస్ త్రాగితే.. మతిపోయే లాభాలు !
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
సీజనల్ జ్వరాలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ,జీవనశైలిని మార్చుకోవడం అవసరం.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే చర్యలు తీసుకోండి.
విటమిన్ సి ,డి (నిమ్మ, నారింజ, ఆమ్లా, పుట్టగొడుగు) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం (పాలు, పెరుగు, గుడ్లు, వేరుశనగలు, పప్పులు) తీసుకోవడం అవసరం.
హెర్బల్ టీలు, డికాషన్లు (అల్లం, తులసి, పసుపు, నల్ల మిరియాలు) ఫ్లూ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
నీరు పుష్కలంగా త్రాగాలి (రోజుకు 8-10 గ్లాసులు). హైడ్రేషన్ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండండి.
కళ్ళు, ముక్కు ,నోటిని తరచుగా తాకకండి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించండి.
తేలికపాటి జ్వరం, నొప్పికి పారాసెటమాల్ తీసుకోండి. లక్షణాలు కొనసాగితే , 3-4 రోజుల్లో కూడా తగ్గకపోతే డాక్టర్లను సంప్రదించండి.