Kitchen Items: ప్రస్తుత బిజీలైఫ్‌లో కిచెన్‌లో ఎక్కువ సమయం గడపడం ఎవ్వరికైనా కష్టమే. ఇంటి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం స్వహస్తాలతో వంట చేసుకోవడం అవసరం. కానీ ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లోనే వంట చేయాలనుకుంటే మాత్రం మీ పనిని సులభతరం చేసే కొన్ని వస్తువులను మీ వంటగదిలో తప్పకుండా ఉంచుకోవాలి. మీరు ఇంట్లో ఒంటరిగా పని చేసుకునేవారయితే.. మాత్రం ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఆ వస్తువులేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బాయిలర్:
ఎగ్ బాయిలర్ అనేది ప్రతి ఒక్కరి వంటగదిలో కలిగి ఉండాల్సిన వస్తువు. దీనిలో 3 రకాలు అందుబాటులో ఉంటాయి. గుడ్లను తక్కువ సమయంలో ఉడకబెట్టడానికి ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. గుడ్లు ఉడకబెట్టడానికి.. మీరు చేయాల్సిందల్లా తగిన మొత్తంలో నీరు వేసి స్విచ్ ఆన్ చేయడం మాత్రమే. అప్పుడు ఎగ్ బాయిలర్ మీ పనిని సింపుల్‌గా చేస్తుంది.
హ్యాండ్ బ్లెండర్:
ప్రతీ కిచెన్ లో తప్పకుండా ఉండాల్సిన వస్తువుల్లో మరొకటి హ్యాండ్ బ్లెండర్. ఇది ఒకేసారి అనేక పనులను పూర్తి చేస్తుంది. మీరు దీనిని ఉపయోగించి పదార్థాలను కలపవచ్చు. ఎగ్స్ వంటివి గిలక్కొట్టవచ్చు. ఇది మిల్క్ షేక్స్, క్రీమీ స్మూతీస్, హాట్ సూప్స్ , టేస్టీ షేక్స్ తయారు చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ వీటిని తప్పకుండా ఉపయోగించాలి.
ఎలక్ట్రిక్ కెటిల్:
పని చేసే మహిళకు ఎలక్ట్రిక్ కెటిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ అందుబాటులో లేనప్పుడు లేదా వేరే ఆహారం తయారు చేస్తున్నప్పుడు మీరు కెటిల్ చాలా బాగా ఉపయోగించవచ్చు. దీనిని నీటిని వేడి చేయడానికి.. ఇన్‌స్టంట్ టీ లేదా కాఫీ, సూప్, ఇతర డ్రింక్స్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది నీటిని త్వరగా మరిగించడంలో సహాయపడుతుంది.
రైస్ కుక్కర్ :
రైస్ కుక్కర్ అనేది ప్రతి కిచెన్ లో తప్పకుండా ఉండాలి. దీనిని ఉపయోగించి రైస్, పులావ్, వెజిటబుల్ బిర్యానీ చాలా తక్కువ సమయంలో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్ వీటిని వాడటం వల్ల తక్కువ సమయంలోనే మీరు మీ వంటను చేయవచ్చు. దీనిని ప్రతి రోజు ఉపయోగించినా కూడా పెద్దగా కరెంట్ బిల్ రాదు.
Also Read: కాఫీ ఎక్కువగా తాగితే కిడ్నీలు పాడవుతాయా ?
కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ :
మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడితే మాత్రం.. మీరు ప్రతి రోజు ఉదయం దీనితో జ్యూస్ తయారు చేసుకుని తాగొచ్చు. ఇది పండ్లు , కూరగాయలను ఈజీగా జ్యూస్ రూపంలోకి మారుస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్లు సాంప్రదాయ జ్యూసర్ల కంటే బాగా పనిచేస్తాయి. మీకు టైం కూడా సేవ్ అవుతుంది.