BigTV English

Nitish Kumar Reddy: తండ్రికి నితీశ్ కుమార్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్

Nitish Kumar Reddy: తండ్రికి నితీశ్ కుమార్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్

Nitish Kumar Reddy: భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన తండ్రి ముత్యాల రెడ్డికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రత్యేకంగా బంగారు బ్రాస్ లైట్ తయారు చేయించి కానుకగా ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. తన కుమారుడు నితీష్ కోసం ముత్యాల రెడ్డి కెరీర్ ని వదిలేసుకొని జీవితాన్ని త్యాగం చేశారని నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.


Also Read: Ind Vs Eng 2nd Odi: బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్..కోహ్లీ, మిస్టరీ స్పిన్నర్ వచ్చేశారు !

ఈ క్రమంలోనే భారత జట్టుకు ఆడుతూ తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన సందర్భాన్ని పురస్కరించుకొని నితీష్ కుమార్ రెడ్డి ఈ బహుమతిని అందించినట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి రాణించాడు ఈ ఆంధ్ర కుర్రాడు. మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్న సమయంలో.. ఏమాత్రం ఆధరక, బెదరక.. ఒంటిచేత్తో కంగారుల ఆట కట్టించి, చరిత్రలో గుర్తుండిపోయే ఆట ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి.


బుల్లెట్లలాగా దూసుకు వచ్చే బంతులు శరీరాన్ని గాయపరుచుతున్నా లెక్కచేయకుండా నితీష్ చేసిన పోరాటం అసామాన్యం. నితీష్ కుమార్ రెడ్డి నేడు ఈ స్థాయికి చేరడం వెనుక అతడి తండ్రి ముత్యాల రెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. ముత్యాల రెడ్డి గతంలో హిందుస్థాన్ జింక్ లో పనిచేసేవారు. అదే సమయంలో ముత్యాల రెడ్డి ఉదయపూర్ కి బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఉదయపూర్ లో తన కుమారుడునితీష్ క్రికెట్ ఆడడానికి సౌకర్యాలు లేవని, అక్కడి రాజకీయాల ప్రభావంతో ఆట దెబ్బతింటుందని భయపడ్డాడు ముత్యాల రెడ్డి.

దీంతో కొడుకు కెరీర్ కోసం ఆ తండ్రి తన ఉద్యోగానికే రాజీనామా చేశారు. అప్పటికి నితీష్ వయసు 13 ఏళ్లు. 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నితీష్ ఆట మీద, సామర్థ్యం మీద నమ్మకంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కొడుకుకి అండగా నిలిచాడు. అడుగడుగునా కుమారుడిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. అలా తండ్రి తనకోసం పడుతున్న తపన, తన కెరీర్ కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకోవడం నితీష్ కుమార్ రెడ్డిలో మరింత పట్టుదల పెంచింది.

Also Read: Rashid Khan: టీ-20ల్లో రషీద్ ఖాన్ గోల్డెడ్ లెగ్.. 5 టోర్నమెంట్లు వచ్చేశాయి ?

అలాగే బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేసావ్ అంటూ తన తండ్రిని బంధువులు, సన్నిహితులు అన్న సూటిపోటి మాటలు నితీష్ లో కసిని పెంచాయి. అలా తండ్రి కష్టం చూసిన తర్వాత క్రికెట్ మీద ఫోకస్ చేసి.. నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అలా తండ్రి కలను నెరవేర్చి.. నేడు తండ్రికి ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చి తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. ఇలా నితీష్ కుమార్ రెడ్డి తన తండ్రికి ఇచ్చిన బహుమతి పై సోషల్ మీడియాలో క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×